ఫ్యాక్ట్ చెక్: ఫార్మ్ చికెన్ వలన బ్లాక్ ఫంగస్ వస్తుందా..? దీనిలో నిజమెంత..?

-

చికెన్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. నిజంగా చికెన్ కి దూరంగా ఉండడం చాలా మందికి కష్టమనే చెప్పాలి. అయితే తాజాగా ఒక వార్త వచ్చింది. అదేమిటంటే ఫార్మ చికెన్ తినడం వల్ల బ్లాక్ ఫంగస్ వస్తుందని అంటున్నారు. దీనిలో నిజమెంత అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

అయితే బ్లాక్ ఫంగస్ గురించి ముందు చూద్దాం… బ్లాక్ ఫంగస్ ఎందుకు వస్తుంది అంటే ..? మ్యూకర్ అనే ఫంగస్ కారణంగా ఈ మ్యుకర్మైకోసెస్ వస్తుంది. యునైటెడ్ స్టేట్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఇది చాలా ప్రాణాంతకమైన ఫంగస్ ఇన్ఫెక్షన్ అని చెప్పింది. ఈ వైరస్ కారణంగా చాలా మందిలో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.

కరోనా తగ్గిన వాళ్ళలో ఈ ఫంగస్ వస్తుందని మనకి తెలిసిందే. అయితే మొత్తం ప్రకృతి అంతటిలో కూడా ఈ వైరస్ ఉంటుందని ఇది కోళ్లని కూడా ఎఫెక్ట్ చేస్తుందని డాక్టర్ ముఖర్జీ అన్నారు. అయితే ఈ బ్లాక్ ఫంగస్ అనేది ఒకరి నుంచి మరొకరు సోకదని.. జంతువుల నుంచి మనుషులకు సోకే అవకాశం లేదని ఇది రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల వస్తుందని అన్నారు.

కోళ్లకి కూడా బ్లాక్ ఫంగస్ రావచ్చని కానీ ఇప్పటివరకు అయితే కోళ్ళలో వచ్చినట్టు ఎక్కడ చూడలేదని అన్నారు. అయితే ఒకవేళ ఏదైనా జంతువుకి ఈ ఫంగస్ ఇన్ఫెక్షన్ వస్తే వాటి నుంచి చాలా దుర్వాసన వస్తుందని. ఆ వాసన కారణంగా కోళ్లను తినలేరని అన్నారు.

ఫ్యాక్ట్ చెక్: సోషల్ మీడియాలో కోళ్ల కారణంగా కూడా బ్లాక్ ఫంగస్ వస్తుందని కొన్ని రోజుల పాటు ఫార్మ్ చికెన్ తీసుకోకుండా ఉండటమే సురక్షితం అన్న వార్త వచ్చింది. ఇది ఇప్పటి వరకూ జంతువుల్లో రాలేదని అయితే ఒకవేళ కోళ్ళకి బ్లాక్ ఫంగస్ వున్నా మనుషులకి సోకదని స్పష్టమైపోయింది. కాబట్టి చికెన్ కి దూరంగా ఉండక్కర్లేదు అని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news