ఇతను మరో భారతీయుడా..!

-

కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి అందరికి సుపరిచితుడే.. తెలుగులో పిజ్జా సినిమాతో హిట్ అందుకున్న అతను ప్రతి సినిమా ఎంతో ప్రత్యేకంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. ఈమధ్యనే 96 అంటూ ఓ డిఫరెంట్ మూవీ చేసి హిట్ అందుకున్న విజయ్ సేతుపతి లేటెస్ట్ గా సీతాకాతి అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ ఏకంగా 70 ఏళ్ల ముసలోడుగా కనిపిస్తున్నాడు.

కెరియర్ లో ప్రతి సినిమాను ఓ సవాల్ గా స్వీకరిస్తున్న విజయ్ సేతుపతి సీతాకాతి కోసం ఏకంగా 70 ఏళ్ల ఓల్డ్ మన్ గా మారాడు. దీనికి సంబందించిన ఫస్ట్ లుక్ ఈమధ్యనే రిలీజ్ చేశారు. విజయ్ లుక్ చూస్తే భారతీయుడు సినిమాలో కమల్ హాసన్ గుర్తుకు రాక మానదు. బాలాజి ధరణీధరణ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని అంటున్నారు.

ఈ సినిమాతో పాటుగా తెలుగులో మెగాస్టార్ చిరంజీవి ప్రెస్టిజియస్ గా చేస్తున్న సైరా సినిమాలో కూడా నటిస్తున్నాడు విజయ్ సేతుపతి. తమిళ ప్రేక్షకులను అలరిస్తున్న విజయ్ తెలుగు ఆడియెన్స్ ను కూడా ఆకట్టుకుంటాడేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version