స్టార్ హీరోల‌ను ఫాలో అవుతున్న విజ‌య్‌.. అభిమానుల‌కు స‌ర్‌ప్రైజ్‌!

అది ల‌క్కో లేక క‌ష్ట‌మో మ‌రేంటో తెలియ‌దు గానీ.. ఏ హీరోకూ సాధ్యం కాని త‌క్కువ టైమ్ లో అంత క్రేజ్ సంపాదించాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వ‌చ్చి.. స్టార్ హీరోల వార‌సుల‌కు కూడా సాధ్యంకాని స్టార్ డ‌మ్ ను త‌క్కువ టైమ్ లో సంపాదించాడు. మాస్ ఆడియెన్స్ లో మ‌నోడికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇక అమ్మాయిల‌లో అత్యంత ఫాలోయింగ్ కూడా ఈ హీరోకే సొంతం.

అయితే విజ‌య్ కూడా అంద‌రి హీరోల్లాగే ఓ సెంటిమెంట్ ను, ఓ ట్రెండ్ ను ఫాలో అవుతున్నాడు. అదేంటంటే.. ఇప్పుడు ఈ హీరో డైరెక్ట‌ర్ పూరి జ‌గన్నాథ్ తో లైగ‌ర్ అనే సినిమా చేస్తున్నాడు. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది ఈ సినిమా.

ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం పోస్ట‌ర్ మాత్ర‌మే విడుద‌లైంది. కానీ ఒక టీజ‌ర్ గానీ, ట్రైల‌ర్ గానీ రాలేదు. అయితే ఇప్పుడు అంద‌రి హీరోల్లాగే త‌న బ‌ర్త్ డే రోజు ఏదో ఒక స‌ర్ ప్రైజ్ ఇవ్వాల‌ని చూస్తున్నాడు విజ‌య్‌. మే 9న విజయ్ పుట్టిన రోజు కావ‌డంతో ఆ రోజు లైగ‌ర్ కు సంబంధించిన టీజ‌ర్ విడుద‌ల చేయాల‌ని మూవీ టీం భావిస్తోంది. దీంతో విజ‌య్ అభిమానుల్లో సంతోషం నెల‌కొంది.