ప్రపంచ చేతి శుభ్రత దినోత్సవం 2021: చేతులని ఎలా శుభ్రపర్చుకోవాలో తెలిపే చిన్న టిప్స్..

మహమ్మారి మొదలయినప్పటి నుండి మాస్క్ పెట్టుకోవడం, భౌతిక దూరం ఎంత ముఖ్యం అయ్యిందో దానికన్నా ముఖ్యంగా మారిన మరొక అంశం చేతులు శుభ్రంగా ఉంచుకోవడం. డాక్టర్లు, నిపుణులు పదే పదే ఈ మాటని నొక్కి వక్కాణిస్తున్నారు. చేతులను శుభ్రపర్చుకుంటే మహమ్మారి వ్యాపించే బాగా తగ్గుతుందని, వ్యక్తిగత పరిశుభ్రతలో చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రాథమైకమైనది ప్రతీ ఒక్కరు చెబుతున్నారు. ముఖ్యంగా బాత్రూంకి వెళ్ళి వచ్చిన తర్వాత, భోజనానికి ముందు చేతులని పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

ప్రపంచ చేతి శుభ్రత దినోత్సమైన ఈ రోజున చేతుల శుభ్రత గురించి ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలి. అసలు చేతులు శుభ్రపర్చుకోవడానికి ఒకరోజు ఉందన్న విషయం చాలామందికి తెలియదు. రోజువారి దినచర్యలో భాగంగా అక్కడా ఇక్కడా ముట్టుకుంటాం కాబట్టి ఖచ్చితంగా చేతులని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇలా ఉంచుకోవడం వల్ల వ్యాధులు వ్యాపించకుండా ఉంటుంది. వ్యాధి కారక వైరస్ లు ఎక్కువగా చేతుల ద్వారానే శరీరంలోకి ప్రవేశిస్తాయి. అందుకే ఎప్పటికప్పుడు సబ్బుతో చేతులను శుభ్రపర్చుకోవడం, శానిటైజ్ చేసుకోవడం తప్పనిసరి.

చేతులు శుభ్రంగా ఉంచుకోవడానికి కొన్ని టిప్స్

వేడినీళ్ళతో చేతులని శుభ్రపర్చుకోవద్దు. వేడినీటితో చర్మం పొడిగా మారుతుంది. దాని స్థానంలో గోరువెచ్చని నీళ్ళని వాడండి. వేళ్ళసందులు, మణీకట్టు ప్రాంతాన్ని బాగా శుభ్రపరచండి. ముఖ్యంగా గోళ్ళ సందుల్లో వ్యాధులని తెప్పించే సూక్ష్మక్రిములు దాగి ఉంటాయి. కాబట్టి గోళ్ళ సందులని శుభ్రపర్చుకోండి.

చేతుల శుభ్రత స్చచ్చంగా, సేఫ్ గా ఉండాలంటే హ్యాండ్ వాష్ లిక్విడ్ వాడడం బెటర్. అవి కూడా కలబంద, తులసి, నిమ్మ వంటివి అయితే బాగుంటుంది.

సబ్బు పెట్టుకున్నాక చేతులని నీటితో బాగా శుభ్రపర్చుకోండి. మీ చేతుల మీద ఎక్కడా కూడా సబ్బు మరకలు ఉండకుండా చూసుకోండి.

నీటితో చేతులకి కడిగిన తర్వాత పొడి టవల్ లేదా పొడి టిష్యూ పేపర్ వాడండి. తడిగా ఉన్న వాటి మీద సూక్ష్మ క్రిములు ఉండే అవకాశం ఉంది.

మీరెక్కడి వెళ్ళినా మీతో పాటు ఆల్కహాల్ శానిటైజర్ ఉంచుకోండి. అందులోనూ ధన్యాలు, వేప, నట్ గ్రాస్ మొదలైన ఫ్లేవర్లని ఉంచుకోండి.