“రానా నాయుడు” సినిమాపై విజయశాంతి సీరియస్..సెన్సార్ ఉండాల్సిందే !

“రానా నాయుడు” సినిమాపై విజయశాంతి సీరియస్ అయ్యారు. అయితే.. ఆ సినిమా పేరు ఎత్తకుండా విమర్శలు చేశారు రాములమ్మ. ఈ మధ్యనే విడుదలైన ఒక తెలుగు (బహుబాషా) ott సిరీస్ పై……”It needs Censor for ott platform”… అనే విషయమై అనేకమంది ప్రజలు, ప్రత్యేకించి మహిళలు ఈ సమస్య ముందుకు ఇప్పటికే తెస్తున్నారని పేర్కొన్నారు.

ప్రజల మనోభావానుసారం నేను చెప్తున్న అంశం అర్థం చేసుకుని, తీవ్ర మహిళా వ్యతిరేకతతో కూడిన ఉద్యమాల దాకా తెచ్చుకోక, సంబంధిత నటులు, మరియు నిర్మాతలు Ott నుండి నిరసించబడుతున్న పై ప్రసారాలని తొలగించి భవిష్యత్‌లో దేశవ్యాప్త ott ప్రసారాలలో ఎక్కడైనా ప్రజా ప్రత్యేకించి మహిళా వ్యతిరేకతకు గురి అయ్యే విధానాలు లేని పద్ధతులు పాటించాలని భావిస్తూ.. తమకు ప్రజలు ఇచ్చిన అభిమానాన్ని, మరింత గౌరవంతో నిలబెట్టుకుంటారని అభిప్రాయపడుతున్నానని అభిప్రాయపడ్డారు విజయశాంతి.