VijayDeverakonda : సమంతతో విజయ్ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటో వైరల్

-

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ కు ప్రస్తుతం ఫుల్ ఫాంలో ఉన్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే సినిమాను విజయ్ దేవరకొండ చేస్తున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తున్నారు. దీంతో విజయ్ దేవరకొండ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. వరుసగా సినిమా ఆఫర్లతో పాటు కమర్షియల్ యాడ్స్ కూడా హీరో విజయ్ దేవరకొండ కు కలిసి వస్తున్నాయి.

సినిమా షూటింగ్ లతో పాటు వరుసగా కమర్షియల్ యాడ్స్ లోనూ విజయ్ దేవరకొండ నటిస్తున్నారు. ఇది ఇలా ఉండగా.. ఇవాళ యంగ్ హీరో విజయ్ దేవరకొండ పుట్టిన రోజు. ఈ నేపథ్యంలోనే… తన పుట్టిన రోజు వేడుకను సమంతతో చేసుకున్నాడు. వీరిద్దరి కాంబినేషన్‌ లో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే… చిత్ర బృందంతో కలిసి యంగ్ హీరో విజయ్ దేవరకొండ తన పుట్టిన రోజు వేడుకలను చేసుకున్నాడు. ఇందులో సమంత పాల్గొనడం హైలెట్‌. దీనికి సంబంధించిన ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news