యశోద సినిమాలో సమంతకు బదులు ఆమె నటించి ఉంటే బాగుండేదన్న పరుచూరి..!

-

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే తాజాగా ఈమె నటించిన చిత్రం యశోద . సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయం సొంతం చేసుకోవడంతో పాటు కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అంతేకాదు 2022లో హిట్ కొట్టిన సినిమా జాబితాలో ఇది కూడా చేరిపోయింది. అయితే ఎప్పుడూ చూడని విధంగా సమంత ఈ సినిమాలో యాక్షన్ సన్నివేషాలలో నేరుగా పాల్గొనడంతో ఆమె నటనకు పలువురు ప్రముఖులు సైతం ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాతో మరొక హిట్ టాక్ ను సొంతం చేసుకుంది సమంత.

ఇదిలా ఉండగా సమంత గత కొన్ని నెలలుగా మయో సిటీస్ అనే వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఆమె ఆ భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నప్పటికీ కూడా యశోద సినిమాను ప్రమోట్ చేసింది. ఇదిలా ఉండగా ఇప్పటికే ఈ సినిమా చూసిన పలువురు ప్రముఖులు సమంతా పై ప్రశంసల వర్షం కురిపిస్తుంటే.. పరుచూరి గోపాలకృష్ణ మాత్రం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఆయన మాట్లాడుతూ పురిటి పిల్లల ప్లాస్మాతో కోట్లాది రూపాయల అక్రమ వ్యాపారం చేయడం.. దాని వెనుక ఒక పెద్ద మాఫియాను క్రియేట్ చేయడం అన్నది బాగుంది. అలాగే తన చెల్లిని రక్షించుకునే ప్రయత్నంలో ఎంతో రిస్క్ చేసిన సమంత ఈ మాఫియాను అంతమొందించడం కూడా చాలా బాగుంది అని తెలిపారు.

ఇందులో సమంత సీక్రెట్ పోలీస్ ఏజెంట్గా అద్భుతంగా నటించింది. అప్పట్లో ఇటువంటి పాత్రలలో విజయశాంతి నటించేవారు . విజయశాంతి బాడీ లాంగ్వేజ్ కి యశోద లాంటి సినిమా బాగా సరిపోతుంది. అప్పట్లోనే ఇటువంటి సినిమా విజయశాంతి చేసి ఉంటే ఇంకా పవర్ఫుల్ గా ఉండేది అంటూ పరుచూరి గోపాలకృష్ణ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. సమంత కూడా ఈ సినిమాలో చాలా అద్భుతంగా నటించింది. అందుకే ఆమె ఈ స్థాయికి చేరుకుంది అని కూడా తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news