యావత్తు ప్రపంప దేశాలను భయాందోళనకు గురిచేస్తున్న కరోనా రక్కసి మరోసారి విజృంభిస్తోంది. అయితే.. చైనాలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. రోజూ లక్షల సంఖ్యలో ప్రజలు వైరస్ బారిన పడుతున్నారు. ప్రభుత్వం అధికారికంగా ప్రకటించనప్పటికీ.. దేశంలో వేల సంఖ్యలో జనాలు మృత్యువాత పడుతున్నారని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. బ్రిటన్‌కు చెందిన ఎయిర్ఫినిటీ (Airfinity) అనే పరిశోధనా సంస్థ డ్రాగన్ కంట్రీలో రోజుకు సుమారు 9 వేల మంది కోవిడ్‌తో మరణిస్తున్నారని తన నివేదికలో పేర్కొన్నది. కరోనా ఆంక్షలు ఎత్తివేయకముందు నుంచి కొన్ని ప్రావిన్స్‌లలో కరోనా తీవ్రతను రికార్డు చేస్తున్నట్లు వెల్లడించింది.
ఒక్క డిసెంబర్ నేలలో కోటీ 86 లక్షల కేసులు నమోదయ్యాయని తెలిపింది. వారిలో సుమారు లక్ష మంది మరణించి ఉంటారని పేర్కొన్నది. జనవరి మధ్య నాటికి రోజుకు 37 లక్షల కేసులు నమోదవుతాయని హెచ్చరించింది. నెలాఖరుకు వైరస్ 5 లక్షల 84 వేల మంది చనిపోయే అవకాశం ఉందని పేర్కొన్నది. కాగా, డిసెంబర్ 30న దేశంలో ఒక్కరు మాత్రమే మరణించారని ప్రభుత్వం ప్రకటించడం విశేషం. అయితే వాస్తవిక గణాంకాలను వెల్లడించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చైనా ప్రభుత్వాన్ని కోరింది. శంలో కోవిడ్ పరిస్థితులపై నిర్ధిష్టమైన సమాచారాన్ని క్రమంతప్పకుండా అందించాలని సూచించింది. వైరస్ బారినపడి దవాఖానల్లో చేరిన వారి సంఖ్య, జెనెటిక్ సీక్వెన్సింగ్, కరోనా మరణాలు, టీకాలపై డాటాను పంచుకోవాలని చైనా ఆరోగ్య అధికారులకు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.