మందు తాగి నిద్రపోతున్న కమల్ హాసన్..ఎక్కడో తెలుసా?

లోకనాయకుడు కమల్ హాసన్ ఫూటుగా మద్యం తాగి నిద్రపోతున్నాడు. ఎక్కడంటే..‘విక్రమ్’ సినిమాలో..ఇందుకు సంబంధించిన పోస్టర్ ను తాజాగా మేకర్స్ ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పిక్చర్ జూన్ 3న విడుదల కానుంది.

సెన్సార్ కార్యక్రమాలను ఈ సినిమా పూర్తి చేసుకున్నట్లు ట్వి్ట్టర్ వేదికగా డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ తెలిపారు. సెన్సార్ బోర్డు సభ్యులు చిత్రానికి U/A సర్టిఫికెట్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. మేకర్స్ విడుదల చేసిన తాజా పోస్టర్ లో కమల్ హాసన్.. మందు బాటిల్ ముందర పెట్టుకుని ఓ గ్లాసులో పోసుకున్న మద్యం తాగి..నేల మీద కూర్చొని టైరుకు ఆనుకుని నిద్రిస్తున్నాడు.

ఈ సరికొత్త పోస్టర్ చూసి నెటిజన్లు ఈ సినిమా డెఫినెట్ గా హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తు్న్నారు. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ ఫిల్మ్ లో విజయ్ సేతుపతి, ఫహద్ ఫజిల్, సూర్య కీలక పాత్రలు పోషించారు. పాన్ ఇండియ వైడ్ గా రిలీజ్ కాబోతున్న ఈ పిక్చర్ ప్రమోషన్స్ పైన మేకర్స్ ఫుల్ ఫోకస్ పెట్టారు.