పాకిస్థాన్​లో విరాట్-దీపిక-షారుక్.. ఇంట్రెస్టింగ్ పిక్స్ వైరల్

-

ప్రజెంట్ సోషల్ మీడియాలో మొత్తం ఏఐ మ్యాజిక్​ కనిపిస్తోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్​తో క్రియేట్ చేసిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి. ఏఐ సాయంతో తమ అభిమాన హీరోహీరోయిన్లను, క్రికెటర్లను తమకు నచ్చిన రూపంలో డిజైన్ చేసేస్తున్నారు ఫ్యాన్స్. తాజాగా ఓ యూజర్ కూడా తన ఫేవరెట్ హీరోహీరోయిన్లను.. క్రికెటర్లను.. సింగర్లను ఏఐ సాయంతో కొత్తగా రూపొందించాడు. అయితే తన ఊహకు కాస్త క్రియేటివిటీ యాడ్ చేసి మన ఇండియన్‌ సెలబ్రిటీలు పాకిస్థాన్‌ వెళ్లి అక్కడ ఫొటోలు దిగితే ఎలా ఉంటుంది..? అని ప్రయత్నించాడు. దానికి తగ్గట్టుగా ఫొటోలు క్రియేట్ చేసి నెట్టింట వదిలాడు. ఇంకేం క్షణాల్లో ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

ఏఐని ఉపయోగించి పాక్‌లోని పర్యాటక ప్రాంతాల్లో మన సెలబ్రిటీలు పర్యటించి ఫొటోలు దిగినట్లు క్రియేట్‌ చేశాడు ఆ యూజర్. సినీ, క్రీడా ప్రముఖుల కృత్రిమ చిత్రాలను రూపొందించిన ఆ నెటిజన్ టాలెంట్​కు జనాలు ఫిదా అవుతున్నారు. బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారుక్‌ ఖాన్​, స్టార్‌ క్రికెటర్‌ విరాట్ కోహ్లీ, హీరోయిన్‌ దీపికా పదుకొణె.. ఇలా చాలామంది సెలబ్రిటీలు పాకిస్థాన్‌లో ఉన్నట్లు ఉన్న ఫొటోలు ఇంటర్నెట్‌లో హల్​చల్​ చేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version