నా స‌ర్వ‌స్వం, నా ప్ర‌పంచం ఒకే ఫ్రేమ్‌లో.. విరాట్‌

సీనీ-క్రీడా రంగాల్లో బెస్ట్ క‌పుల్‌గా మొద‌టి పేరు కోహ్లీ, అనుష్క‌లదే ఉంటుంది. ఎప్పుడూ సినిమాలు, మ్యాచ్‌ల‌తో బిజీగా ఉండే వీరిద్ద‌రూ లాక్‌డౌన్ కార‌ణంగా ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. చాలారోజుల‌కు ఇద్ద‌రు ఎక్కువ‌రోజులు క‌లిసి ఉన్నార‌ని చెప్ప‌వ‌చ్చు. లాక్‌డౌన్‌లో తాము చేసే ప్ర‌తి అల్లర్లు, ప‌నుల‌ను షేర్ చేస్తూ ఉంటుంది అనుష్క‌. అలాగే ఒక‌రోజు ‘2021 నాటికి మేమిద్ద‌రు ముగ్గురం కాబోతున్నాం’ అని అనుష్క చేసిన ట్వీట్‌కు యావ‌త్ అభిమానులంద‌రూ మురిసిపోయారు. మా చిన్ని కోహ్లీ ఎప్పుడోస్తాడో అని ఒక‌రంటే మా బుల్లి అనుష్క ఎప్పుడు చూస్తామో అంటూ కొంద‌రు నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.

ఇటీవ‌ల అనుష్క పోస్ట్ చేసిన‌ ఓ ఫోటో‌కు కోహ్లీ కామెంట్ చేశారు. త‌న గ‌ర్బాన్ని చూసుకుంటూ నిల్చున్న ఫోటోను షేర్ చేస్తూ దానికి ‘మ‌నం ఇంకొక‌రికి ప్రాణం పోయ‌డం అద్భుతం. ఈ ప్ర‌పంచంలో ఇంత‌కంటే మ‌ధుర‌మైన‌ది ఇంకోటి లేదు’ అని ట్వీట్ చేసింది. దీనికి ‘నా స‌ర్వ‌స్వం, నా ప్ర‌పంచం మొత్తం ఒక్క ఫ్రేమ్‌లో క‌నిపిస్తోంది’ అంటూ కోహ్లీ త‌న ఆనందాన్ని కామెంట్ రూపంలో తెలియ‌జేశారు. వీరిద్ద‌రి ప్రేమ‌కు విరుష్క‌ అభిమానులు సంబ‌ర‌ప‌డిపోతున్నారు.