అనీషాతో లవ్.. విశాల్ బయటపెట్టిన సీక్రెట్స్..!

-

కోలీవుడ్ హీరో విశాల్ కొన్నాళ్లుగా ప్రేమిస్తున్న అనీషాతో పెళ్లికి సిద్ధమవ్తున్నాడు. అతంకుముందు వరలక్ష్మి శరత్ కుమార్ తో లవ్ ఎఫైర్ నడిపించిన విశాల్ సడెన్ గా ఏమైందో ఏమో కాని తనకు కాబోయే భార్య పేరు అనీషా అని షాక్ ఇచ్చాడు. తెలుగు అర్జున్ రెడ్డి సినిమాలో చిన్న పాత్ర చేసిన అనీషా జాయిత స్థాయి బాస్కెట్ బాల్ ప్లేయర్ కూడా.. అంతేకాదు సోషల్ వర్కర్ గా చాలా పనులు చేస్తుందట.

తను తీసిన స్ట్రీట్ డాంగ్స్ ఫిల్మ్ లో స్క్రిప్ట్ లో భాగంగా అనీషాని మొదట చూడటం జరిగిందని.. ఆ సినిమాకు అనీషా పనిచేయడంతో ఆమెతో చనువు పెరిగిందని.. ఇక అభిప్రాయాలు కలవడం వల్ల ఆమెను దేవుడు తన కోసమే పంపించాడని అనిపిస్తుందని అన్నాడు విశాల్. చూస్తుంటే మనవాడికి అనీషా మీద చాలా ప్రేమ ఉన్నట్టు తెలుస్తుంది. పెళ్లి తర్వాత ఆమె కెరియర్ పై పూర్తి స్వేచ్చ ఇస్తానని.. ముఖ్యంగా ఆమె ఓ పులిని నిద్రపుచ్చే తీరు తనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని.. ఆ వీడియో చూసి తను షాక్ అయ్యానని తన ఫియాన్సీ గురించి గొప్పగా చెబుతున్నాడు విశాల్. మొత్తానికి విశాల్ మనసు గెలుచుకున్న అనీషా అతని లైఫ్ లోకి వస్తుంది. ప్రస్తుతం విశాల్ అయోగ్య సినిమా చేస్తున్నాడు. ఎన్.టి.ఆర్ చేసిన టెంపర్ సినిమాకు అది అఫిషియల్ రీమేక్.

Read more RELATED
Recommended to you

Latest news