బాలీవుడ్ హీరోఅయిన వివేక్ ఒబెరాయ్ రాం గోపాల్ వర్మ రక్తచరిత్రతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. సౌత్ సినిమాల్లో విలన్ పాత్రల్లో నటిస్తున్న వివేక్ ప్రస్తుతం రాం చరణ్, బోయపాటి కాంబినేషన్ లో మూవీలో ప్రతి నాయకుడిగా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం వివేక్ 1.25 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. ఈ సినిమా తర్వాత నాగ్, నానిల మల్టీస్టారర్ గా వస్తున్న దేవదాస్ లో కూడా ఛాన్స్ అందుకున్నాడట.
ఆ సినిమాలో విలన్ గా చేయాలంటే మాత్రం రెండున్నర కోట్లు ఇస్తేనే అని అన్నాడట. ఒక సినిమాకి కోటిన్నర అడిగి ఆ వెంట సినిమానే మరో కోటి అందనంగా అడగడంతో దేవదాస్ నిర్మాతలు సైలెంట్ అయ్యారట. సెట్స్ మీద ఉన్న బోయపాటి సినిమా రిలీజ్ అయ్యాక రెమ్యునరేషన్ పెంచినా ఓకే కాని సినిమా షూటింగ్ జరుగుతుండగానే పెంచితే ఎలా అని గుస గుసలాడుతున్నారు.
బాలీవుడ్ లో ఎలాగు కెరియర్ ఆశాజనంగా లేదు కాబట్టి సౌత్ సినిమాల మీద ఫోకస్ పెట్టాడు వివేజ్ ఒబేరాయ్. బోయపాటి సినిమాలో విలన్ అంటే తెలుగులో అయితే తిరుగులేదు అన్నట్టే. విలన్ గా వివేజ్ ఎలాంటి క్రేజ్ తెచ్చుకుంటాడో చూడాలి.