అబ్బో…ఏం తెలివితేటలు..!

-

టర్కీలోని ఒక పాపులర్ టీవీ చానెల్లో మన కేబీసీ (కౌన్ బనేగా కరోడ్‌పతి) వాళ్ల భాషలో వస్తోంది. 26ఏళ్ల సు ఏహన్ అనే ఎకనామిక్స్ గ్రాడ్యుయేట్ హాట్ సీట్లో కూర్చుంది. స్క్రీన్ మీద తర్వాతి ప్రశ్న.

‘గ్రేట్‌వాల్ ఆఫ్ చైనా’ ఎక్కడుంది? …… ఆప్షన్స్….1) చైనా 2) ఇండియా 3) దక్షిణ కొరియా 4) జపాన్.

అంతే..! ఆ అమ్మాయి మొహంలో చకచకా రంగులు మారిపోతున్నాయి. కాసేపు దిక్కులు చూసి, తర్వాత వాళ్ల అమితాబ్‌ను లైఫ్‌లైన్ వాడుకుంటా అని అడిగింది. నాకు ఆన్సర్ తెలుసూ.. బట్, కన్‌ఫర్మ్ చెసుకోవడానికే అని బిల్డప్ కూడా ఇచ్చింది. ముందుగా ఆడియెన్స్ పోల్ తీసుకున్న ఏహన్‌కు మేమేం తక్కువ కాదన్నట్టుగా కేవలం 55% మందే చైనా అని చెప్పగా, 25శాతం ఇండియా అని చెప్పారు. దీంతో మళ్లీ ఆలోచనలో పడ్డ ఆ అమ్మాయి ఈసారి ఫోన్-ఏ-ఫ్రెండ్ తీసుకుని ఆ స్నేహితుడు చైనా అని గట్టిగా చెప్పడంతో లాక్ చేసి బ్రతుకు జీవుడా అని బయటపడింది.

ఒక పాపులర్ టర్కిష్ పాటను గుర్తించడంలో విఫలమై, ఆ తర్వాతి ప్రశ్నకే ఇంటిదారి పట్టిన ఆ అమ్మాయి, చాలా సిగ్గుపడాల్సిన పరిస్థితినుండి బయటపడ్డా, నెటిజన్లు మాత్రం ఏకేసారు. అయినా ఏ మాత్రం తగ్గకుండా, నా లైఫ్‌లైన్లు..నా ఇష్టం, మీరెవరు? అని పైగా ఎదురుదాడికి దిగింది. ఇదీ నేటి యువత దుస్థితి. అన్నట్టు, మనవాళ్లు కూడా తక్కువేం కాదు.

చంద్రునిపైనుంచి చూసినా కనబడే చైనా మహాకుడ్యం ఆ దేశానికే తలమానికం. క్రీ.పూ 3వ శతాబ్దం నుండి మింగ్ శకం (1384 – 1644) వరకు నిర్మింపబడిన ఈ మహాకుడ్యం నిజానికి 8000 కి.మీ.ల పొడవున్న వందలాది గోడల సమాహారం.

Read more RELATED
Recommended to you

Latest news