వామ్మో: ముఖేష్ అంబానీ వంటవాడి జీతం అన్ని లక్షలా..?

-

ముఖేష్ అంబానీ గురించి ఆయన సంపన్నమైన జీవితం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే అంబానీ ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రించే వరకు ప్రతి విషయంలో కూడా లగ్జరీ గానే ఆయన తన జీవితాన్ని కొనసాగిస్తారు. ఇక పోతే ఇప్పుడు వైరల్ గా మారిన విషయం ఏమిటంటే అంబానీ ఇంట్లో వంట వాడి జీతం ఎంత ఉంటుంది అని.. అయితే ఆ జీతం ఎంతో తెలిస్తే మాత్రం నిజంగా షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఒక రాష్ట్రంలో అత్యున్నత సభలో ప్రాతినిధ్యం వహించే ఎమ్మెల్యేలు కూడా ఈ స్థాయిలో జీతం పొందరేమో.

ఆ చెఫ్ అంత జీతం పొందుతున్నాడు అంటే ఏమి వంటలు చేస్తాడో తెలిస్తే మాత్రం ఆశ్చర్యం కలగక మానదు. దేశంలోనే అత్యంత సంపన్నుడు ఆసియాలోనే నెంబర్ వన్ కుబేరుడు అయిన ముఖేష్ అంబానీ ఏది చేసినా సరే ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా అంబానీ నివాసం ఉండే ఆంటీలియా భవనం గురించి అనేక వింతలు విశేషాలు సోషల్ మీడియాలో బాగా వ్యాప్తి చెందడం గమనార్హం. అయితే తాజాగా ఆయన భవనంలో పనిచేసే సిబ్బంది గురించి అనేక విషయాలు బయటకు వస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ఈ ఆంటీలియా భవనంలో సుమారుగా 600 మంది స్టాఫ్ పనిచేస్తున్నారు వీరందరికీ జీతభత్యాలను ముఖేష్ అంబానీ కుటుంబం చెల్లిస్తుంది.

ఇకపోతే అంబానీ కుటుంబానికి వంటలు చేసే చెఫ్ వేతనం నెలకు రెండు లక్షలు అంటే సంవత్సరానికి రూ. 24 లక్షలు అన్నమాట . ఇక కేవలం భోజనం తయారీ కోసం మాత్రమే అపాయింట్ చేశారు. చెఫ్ కుటుంబానికి సంబంధించిన వసతి కూడా మొత్తం యాంటీలియాలోనే ఉంటుంది. వారి కుటుంబానికి కావలసిన సకల సదుపాయాలను కూడా ముఖేష్ అంబానీ కుటుంబమే భరిస్తుంది.. వీరి ఆహారపు అలవాట్ల విషయానికి వస్తే ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ సమయంలో ఇడ్లీ, సాంబార్ తినడం ముఖేష్ అంబానీకి అలవాటు. ఆయన స్వతహాగా శాకాహారి కావడంతో సాత్వికమైన భోజనాన్ని తినడానికి ఇష్టపడతాడు.

భోజనంలో మధ్యాహ్నం సలాడ్స్, రోటీ దాల్ తినడానికి ముకేశ్ అంబానీ ఆసక్తి చూపిస్తారు. ముఖేష్ అంబానీ ఇంట్లో చెఫ్ నియామకం ఒక ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా జరుగుతుంది. ఇక ఆయనకు సంబంధించిన అన్ని వివరాలు కూడా గోప్యంగా ఉంచుతారు.

Read more RELATED
Recommended to you

Latest news