పవన్ ను ఢీ కొట్టబోతున్న బండ్ల గణేష్! ఊహించని ట్విస్ట్!

బండ్ల గణేష్ అంటే సోషల్ మీడియాలో ఉన్న వారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమా పరిశ్రమ లో పవన్ కల్యాణ్ కు భక్తుడిగా పేరు గాంచిన విషయం తెలిసిందే. అంతకు ముందు చిన్న వేషాలు వేస్తూ పెద్దగా పేరు లేని బండ్ల గణేష్ ఇక పవన్ కల్యాణ్ తో సినిమా గబ్బర్ సింగ్ తో ఎక్కడికో వెళ్ళి పోయాడు. దానితో వరసగా సినిమాలు నిర్మించడం చేస్తూ వచ్చాడు.

ఇక సినిమా ఈవెంట్స్ లో పవన్ కల్యాణ్ ను పొగిడే స్పీచ్ లు మరీ రాసుకొని వచ్చి మరీ హంగామా చేస్తూ ఉండేవారు. ఇది ఈవెంట్ కు వచ్చిన పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకర్షించేది. కాక పోతే తన నోటి దూల వల్ల పవన్ ఆప్తుడు అయిన త్రివిక్రమ్ ను తిట్టి పవన్ కు దూరంగా ఉండి పోయాడు. ఇక పవన్ తో మరో సినిమా తీయాలనే ఆశ కూడా ఆవిరి అయ్యే అవకాశం ఉందని, దారులు మూసుకు పోయాయని అంటున్నారు.

బండ్ల గణేష్  టైం పాస్ కోసం ట్విట్టర్ లో రకరకాల పోస్టు లు పెడుతూ అభిమానుల్లో చర్చ జరిగేలా చేస్తూ ఉంటారు. ఇక తాజాగా బాలయ్య బాబు ఇంటర్వ్యూ లో ఒక ప్రశ్నకు గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ హిట్ అయినా కూడా తమకు రెమ్యునరేషన్ కొద్దిగా మాత్రమే ఇచ్చినట్లు పవన్ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఇష్యూ పై ఓ నెటిజన్ బండ్ల గణేష్ కి  ట్వీట్ చేస్తూ నువ్వు ఆయన్ని దైవంలా భావిస్తావు. ప్రేమిస్తావు. ఆయనేమో ఒక పబ్లిక్ షోలో నీ పరువు తీసేశాడంటూ ట్వీట్ చేశారు. దీనికి బండ్ల బదులు ఇస్తూ  త్వరలో”నా విశ్వరూపం చూపిస్తా…” అని మంటలు మండి పోయే విధంగా ట్వీట్ పెట్టారు. దీనితో బండ్ల ముందు ముందు ఏమిచేస్తారో అని పరిశ్రమ లో కంగారు మొదలయ్యింది.

ఆ స్టార్ హీరోల తో తమన్నా ఆ తప్పు చేసిందా?.. అందుకే భయపడుతుందా?