యూరిక్ యాసిడ్ కంట్రోల్ లో ఉండాలంటే.. ఈ చిట్కాలను పాటించాల్సిందే..!

-

వయసు పెరిగే కొద్దీ ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే వాటిలో కీళ్ల నొప్పులు కూడా ఒకటి. ఎప్పుడైతే శరీరంలో యూరిక్ యాసిడ్ పరిమాణం పెరుగుతుందో, కీళ్ల నొప్పులు ఎంతో సాధారణంగా వస్తూ ఉంటాయి. వాటితో పాటు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. అందువలన యూరిక్ యాసిడ్‌ను నియంత్రణలో ఉంచుకోవడానికి రోజువారి ఆహారంలో భాగంగా కొన్ని మార్పులను చేసుకోవాలి. ఇలా చేయడం వలన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఈ మధ్యకాలంలో యూరిక్ యాసిడ్‌కు సంబంధించిన సమస్యలు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి అనే చెప్పవచ్చు.

యూరిక్ యాసిడ్ అనేది ఒక వ్యర్థ పదార్థం. ఇది శరీరంలో ఎక్కువ అవ్వడం వలన కిడ్నీలు ఫిల్టర్ చేయడానికి ఎంతో ఇబ్బంది అవుతుంది. దీంతో ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువలన యూరిక్ యాసిడ్ ను తగ్గించుకోవడానికి ఈ చిట్కాలను తప్పకుండా పాటించాలి లేకపోతే ఆర్థరైటిస్ వంటి సమస్యలు ఎదురవుతాయి. శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు గిలోయ్ ని ఉపయోగించవచ్చు. ఆయుర్వేదంలో గిలోయ్ ని యాంటీ పైరేటిక్ హెర్బ్‌గా పిలుస్తారు. అందువలన శరీరంలో యూరిక్ యాసిడ్ సమస్యను తగ్గించుకోవడానికి గిలోయ్ రసం లేదా గిలోయ్ టీని తప్పకుండా తీసుకోవాలి.

గిలోయ్ తో పాటుగా గుగ్గుల్ కూడా ఎంతో సహాయపడతాయి అనే చెప్పవచ్చు. ఆయుర్వేదంలో గుగ్గుల్ ను పెయిన్ రిలీఫ్‌గా పిలుస్తారు. అంతేకాకుండా యూరిక్ యాసిడ్‌ను తగ్గించడానికి ఇది ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. సహజంగా చాలా మంది ప్రతిరోజూ అల్లం టీ ను తాగుతూ ఉంటారు. అయితే దానిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు నొప్పిని తగ్గిస్తాయి. కనుక అల్లం టీ ని తరచుగా తీసుకోండి. అల్లం టీతో పాటుగా దాల్చిన చెక్కతో తయారు చేసిన టీ తో కూడా యూరిక్ యాసిడ్ ను తగ్గించుకోవచ్చు. పైగా ప్రతి రోజు తీసుకోవడం వలన ఎన్నో ఔషధ గుణాలను పొందవచ్చు. దాల్చిన చెక్క టీ ని తాగడం వలన ఇన్సులిన్ సున్నితత్వం కూడా మెరుగుపడుతుంది. కనుక దాల్చిన చెక్క వంటి హెర్బల్ టీ లను కచ్చితంగా తీసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news