ఢీ నుంచి ప్ర‌దీప్‌ను అందుకే త‌ప్పించారా…?

-

ఈ టీవీలో ప్ర‌సార‌మ‌య్యే ఢీ షోకు ఒక‌ప్పుడు విప‌రీత‌మైన క్రేజ్ ఉండేది. ఆ షో వ‌స్తుందంటే చాలు జ‌నాలు వేలం వెర్రిగా చూసేవారు. ఇప్పటికే ఢీ 11 సీజన్లను కంప్లీట్ చేసుకుని 12వ సీజన్లోకి అడుగు పెట్టి విజ‌య‌వంతంగా న‌డుస్తోంది. ఈ షో ద్వారా ఎంతో మంది వ‌ర్థ‌మాన డ్యాన్స‌ర్లు త‌మ ప్ర‌తిభ‌ను వెలుగులోకి తెచ్చుకున్నారు. ఎంతో మందిని ఢీ షో డాన్సర్లను, డాన్స్ మాస్టర్లను చేసింది. ఇంకా చెప్పాలంటే సౌత్ ఇండియాలోనే ఏ భాష‌లోనూ లేని బెస్ట్ డ్యాన్స్ షోగా ప్ర‌శంస‌లు అందుకుంది.

ఈ షో ద్వారా పాపుల‌ర్ అయిన డ్యాన్స్ మాస్ట‌ర్లే ఇత‌ర భాష‌ల్లో స్టార్ హీరోల సినిమాల‌కు సైతం డ్యాన్స్ కంపోజింగ్ చేస్తున్నారు. అది ఢీ షో రేంజ్‌. కేవలం డ్యాన్స్ మాత్రమే కాకుండా సుధీర్, రష్మీ రొమాంటిక్ కామెడీ.. ప్రదీప్ మాచిరాజు యాంకరింగ్ ఈ షోకి చాలా ప్లస్. ఢీ 10, ఢీ 11 సీజ‌న్ల‌కు ప్ర‌దీప్ యాంక‌రింగ్ చేశాడు. ఈ రెండు సీజ‌న్ల‌లోనూ సుధీర్, రష్మీలు టీం లీడర్లుగా ఉన్నారు.

అయితే 12వ సీజ‌న్ వ‌చ్చే స‌రికి లెక్కలు మారిపోయాయి. ఢీ అంటేనే అంద‌రికి గుర్తుకు వ‌చ్చే ప్రదీప్ యాంకరింగ్, సుధీర్, రష్మీలు టీం లీడర్లు అన్న ఈక్వేష‌న్లు పోయి పటాస్ రవి, వర్షిణిలు టీం లీడర్లుగా వచ్చారు. శ్రీముఖి బిగ్‌బాస్‌కు వెళ్లాక ప‌టాస్‌కు యాంక‌ర్‌గా వ‌ర్షిణి వ‌చ్చింది. అంత‌కు ముందు ఢీ జోడికి వ‌ర్షిణి టీం లీడ‌ర్‌గా ఉండేది. అందుకే రవి, వర్షిణిలను టీం లీడర్లగా చేసి.. సుధీర్, రష్మీలను ఢీ ఛాంపియన్స్ యాంకర్లుగా చేశారు.

ఇక ఈ షో నుంచి ప్ర‌దీప్‌ను యాంక‌ర్‌గా త‌ప్పించార‌నే టాక్ వ‌స్తోంది. దీనికి ఓ టాక్ కూడా వినిపిస్తోంది. షోలో ప్రదీప్, రష్మీ యాంకరింగ్ చేస్తే సుధీర్ కు కామెడీ చేసే ఛాన్స్ మిస్ అవుతుంది. అదే రష్మీ, సుధీర్ యాంకరింగ్ చేస్తే అది వర్కవట్ అవుతుందని ప్రదీప్‌ను పక్కన పెట్టినట్లు రూమర్స్ వస్తున్నాయి. మ‌రి ఇందులో నిజానిజాలేంటో వాళ్ల‌కే ఎరుక‌..!

Read more RELATED
Recommended to you

Latest news