బాక్సాఫీస్ కలెక్షన్లలో గ్రాస్, షేర్, నెట్ అంటే ఏంటి…!

-

ఈరోజుల్లో సినిమా హిట్ అవ్వడం అంటే ఆ సినిమా భారీ వసూళ్లు సాధిస్తేనే హిట్ అయినట్టు భావిస్తారు. గతంలో సినిమా 50 రోజులు వంద రోజులు ఆడితే హిట్ అనే వాళ్ళు. ఇప్పుడు 100 కోట్లు సాధించిన లేకపోతే 80 కోట్లు సాధించిన 200 కోట్లు సాధించింది 150 కోట్లు సాధించింది అంటూ ఈ విధంగా వసూళ్లను ఆధారంగా చేసుకుని జయాపజయాల నిర్దేశిస్తున్నారు. దీంతో దర్శక నిర్మాతలు కూడా వసూళ్లు మీద దృష్టి పెట్టి సినిమా కమర్షియల్ గా,

రూపొందించే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఈ పద్ధతి బాలీవుడ్ కి ఎక్కువగా ఉండేది. అయితే రానురాను అది తెలుగులోకి కూడా వ్యాపించింది. ముఖ్యంగా తెలుగులో స్టార్ హీరోల సినిమాలు అన్ని వంద కోట్లకు పైగా వసూలు చేయటంతో సినిమాలు కమర్షియల్ గా మారిపోయాయి అయితే సినిమా వసూళ్లు గురించి మాట్లాడేటప్పుడు ఎక్కువ గ్రాస్ కలెక్షన్లు నెట్ కలెక్షన్ లు అలాగే షేర్ అంటూ కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు.

అసలు గ్రాస్ అంటే ఏంటి నెట్ అంటే ఏంటి షేర్ అంటే ఏంటి అనేది ఒకసారి చూస్తే షేర్ అంటే ఏంటంటే ప్రొడక్షన్ ఖర్చులూ థియేటర్ అద్దెలు ఇతర ఖర్చులు పోగా మిగిలిన దాన్ని షేర్ అంటారు. థియేటర్లలో టిక్కెట్లు అమ్మగా వచ్చిన దాన్ని గ్రాస్ అంటారు. గ్రాస్ లో నుంచి టాక్స్ తీయ గా దాన్ని నెట్ అంటారు. సోషల్ మీడియాలో ఈ పదాలకు చాలా మందికి అర్దాలు తెలియక వెతికే ప్రయత్నం చేస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news