క్రిష్ పవన్ కళ్యాణ్ ని ముంచుతాడా తేలుస్తాడా ..డైలమాలో పడ్డారే ..?

-

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం ‘వకీల్ సాబ్’ సినిమాతో పాటు క్రిష్ తెరకెక్కిస్తున్న సినిమాలోను నటిస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా వకీల్ సాబ్ లుక్ తో పాటు సాంగ్ ప్రోమో కూడా రిలీజై బాగా ఆకట్టుకుంటున్నాయి. పక్కా వకీల్ సాబ్ తో పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతున్నాడని అందరూ ఫిక్సైయ్యారు. మే 15 న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి నిర్మాత దిల్ రాజు భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఇక క్రిష్ దర్శకత్వంలో షూటింగ్ జరుపుకుంటున్న తాజా సినిమా సన్నివేశాలు కూడా చాలా ఆసక్తికరంగా తెరకెక్కుతున్నాయని లేటెస్ట్ అప్‌డేట్.

 

ప్రస్తుతం యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందట. సముద్రంలో ఓడలో తరలిపోతున్న కోహినూర్ వజ్రాన్ని దొంగిలించే ఫైట్ ని పవన్ కళ్యాణ్ పై క్రిష్ చిత్రీకరిస్తున్నారు. ఈ ఫైట్ సినిమాకే హైలైట్ గా నిలువనుందని చిత్ర యూనిట్ ధీమాగా చెప్పుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించిన తాజా వార్త ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. సినిమాకే హైలైట్ గా నిలువనున్న ఈ ఫైట్ ని ‘షాడో ఫైటర్’ అనే పాపులర్ వీడియో గేమ్ ద్వారా ఇన్స్‌పైర్ అయి చిత్రీకరిస్తున్నారని చెప్పుకుంటున్నారు.

ఈ యాక్షన్ సన్నివేశంలో కోహినూర్ వజ్రాన్ని దొంగిలించేప్పుడు పవన్ కల్యాణ్ చేసే సాహసాలు ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంటాయని తెలుస్తోంది. ఈ దొంగతనం సన్నివేశానికి పవన్ కళ్యాణ్ మార్క్ యాక్షన్ సీక్వెన్స్ మరో లెవల్ కి తీసుకెళుతుందట. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ తో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని ఏఎం రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అయితే ఇప్పటికే క్రిష్ ఫ్లాప్స్ లో ఉన్నాడు. ఇలాంటి టైం లో ఎక్స్‌పరిమెంట్స్ చేసి క్రిష్ పవన్ కళ్యాణ్ ని ముంచుతాడా తేలుస్తాడా ..అన్న డైలమాలో ఫ్యాన్స్ ఉన్నారట.

Read more RELATED
Recommended to you

Latest news