ఆంధ్రప్రదేశ్ లో బలపడటానికి తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. ఏ ఒక్క అవకాశాన్ని కూడా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వదిలిపెట్టే పరిస్థితి కనపడటం లేదు. చిన్న అవకాశాన్ని కూడా ఆయన వదలకుండా పార్టీ నేతలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. గత ఎన్నికల నష్టాల నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడింది.
ఈ తరుణంలో తెలుగుదేశం పార్టీ నెత్తిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బండ వేసారు. అదే బీసీ రిజర్వేషన్ అంశం. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ అంశం గురించి తెలుగుదేశం పార్టీ ఎక్కువగా పోరాడుతుంది. సుప్రీం కోర్ట్ లో స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేసారు. దీనిపై ఇప్పుడు అగ్ర వర్ణాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అంత అవసరం ఉందా అంటూ సొంత పార్టీలో ఉన్న అగ్ర నేతలు ఇప్పుడు చంద్రబాబు తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడే పరిస్థితి ఏర్పడింది.
ఇప్పుడు పార్టీ ప్రజల్లోకి వెళ్ళాలి అంటే ఒక అంశాన్నే పట్టుకుని వేలాడితే మునిగిపోవడం అనేది ఖాయంగా కనపడుతుంది. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ అంశం దెబ్బకు బీసీల్లో కాస్త టీడీపీ బలపడినా సరే అగ్ర వర్గాలు ఇప్పుడు ఆగ్రహంగా ఉన్నాయి. ఇక ఎస్సీ ఎస్టీ లు చంద్రబాబుపై మండిపడుతున్నాయి. మా గురించి ఎందుకు ఆలోచించడం లేదు అనే అభిప్రాయం వారిలో బలంగా వ్యక్తమవుతుంది.
బీసీల మీద మాట్లాడకపోతే బలమైన బీసీ ఓటు బ్యాంకు పార్టీకి పోవడం అనేది ఖాయం మాట్లాడితే ఎస్సీ, ఎస్టీ ఓటు బ్యాంకు పోవడం కూడా ఖాయమే. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నెత్తిన ఈ బండ జగన్ వేసారు. దీనితో ఇప్పుడు ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నా దాని నుంచి టీడీపీ బయటకు వచ్చే పరిస్థితి కనపడటం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి ఇది పెద్ద దెబ్బ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయి.