తెలుగు సినిమాల్లో తెలుగు అమ్మాయిలు ఎక్కడ…?

-

హీరోయిన్ అనగానే మన దర్శకుల చూపు ఎక్కువగా ఉత్తరాది మీదో లేక కేరళ మీదో పడుతుంది. దశాబ్దాలు గా మన తెలుగులో అందమైన అమ్మాయిలు ఉన్నా సరే పరభాషా హీరోయిన్ల మీదే ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారు దర్శక నిర్మాతలు. ఇప్పుడు తెలుగులో హడావుడి చేస్తున్న పూజా హెగ్డే, సమంతా, కాజల్, అనుష్క, సాయి పల్లవి, కీర్తి సురేష్ ఇలా అందరూ పరభాషా హీరోయిన్లే.

మన తెలుగులో ఉన్న వాళ్ళను కనీసం పట్టించుకునే ప్రయత్నం చేయకుండా ఎంత సేపు పరభాషా హీరోయిన్ల మీదే దృష్టి పెడుతున్నారు దర్శక నిర్మాతలు. అక్కడి నుంచి వస్తున్న కొత్త వారికి అవకాశాలు ఇస్తున్నారు. ఒక్క సినిమా కూడా తెలుగులో చేయని వాళ్లకు అవకాశం ఇస్తున్నారు. అది కూడా స్టార్ హీరోల సరసన. సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించిన హీరోయిన్ లో హావభావాలు వెతుక్కునే పరిస్థితి ఉంది.

అరవింద సమేత సినిమాలో పూజ హెగ్డేకి అవకాశం ఇచ్చారు త్రివిక్రమ్. ఆమె కంటే ఏ మాత్రం ప్రాధాన్యత లేని సెకండ్ హీరోయిన్ గా ఉన్న ఈశా రెబ్బా మెరుగ్గా నటించింది. ఆమె తెలుగు అమ్మాయి, ఎక్కడో ఒక సినిమాలో మినహా ఆమెకు నటించే అవకాశం ఇవ్వడం లేదు దర్శకులు. హైదరాబాద్, విజయవాడ, విశాఖ, గుంటూరు ఇలా ఎన్నో ప్రాంతాల్లో కాలేజీల్లో అందమైన అమ్మాయిలో ఈవెంట్ల సందర్భంగా అదిరిపోయే అందాలతో సత్తా చాటుతున్నారు.

అయినా సరే పరభాషా హీరోయిన్లకు అవకాశాలు ఇస్తూ తెలుగు అమ్మాయిలను కనీసం పట్టించుకోవడం లేదు మన దర్శక నిర్మాతలు. ఎందరో తెలుగు అమ్మాయిలు అందం అభినయం ఉండి కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగానే తెలుగు సిని పరిశ్రమలో మిగిలిపోతున్నారు. మనం వద్దని వదిలేసిన అంజలి తమిళంలో స్టార్ హీరోయిన్ అయింది. తమిళ సినిమా మీద ఆధారపడే మన దర్శకులకు అక్కడి ప్రాంతీయ అభిమానం గురించి అంతా తెలుసు.

చాలా వరకు అక్కడి దర్శకులు తమ రాష్ట్రానికి చెందిన హీరోయిన్లకే అవకాశాలు ఇస్తూ ఉంటారు. కొందరు అంటే బాధపడతారు గాని ఒక కవి అన్నట్టు తెలుగు రాష్ట్రాల్లోనే దక్షిణాదిలో అందమైన అమ్మాయిలు ఉన్నారని చెప్పినా మన దర్శకులకు, నిర్మాతలకు మాత్రం కనపడటం లేదు. ఎందరో అమ్మాయిలు సిని పరిశ్రమ మీద ఆసక్తి ఉన్నా సరే కేవలం క్యారెక్టర్ పాత్రల్లోనే ఉండిపోతున్నారు.

ఎంత సేపు, కేరళ, ఢిల్లీ బొంబాయ్ అంటూ పక్క రాష్ట్రాల వైపు చూస్తూ మన వాళ్ళను, ఏ మాత్రం పట్టించుకోవడం లేదు సిని పరిశ్రమ. మరి ఈ దౌర్భాగ్యం నుంచి ఎప్పుడు బయటకు వస్తారో చూడాలి. ఈ మధ్య కాలంలో షార్ట్ ఫిలిమ్స్ లో ఎక్కువగా అందమైన అమ్మాయిలూ కనపడుతున్నారు. టిక్ టాక్ లాంటి సామాజిక మాధ్యమాల్లో అందమైన మగువలు కనపడుతున్నా మన వాళ్ళు మాత్రం పక్క రాష్ట్ర అమ్మాయిలకు ఫోన్ చేస్తూ దిగుమతి చేసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news