Where is Pushpa? : “పుష్ప” ఎక్కడున్నాడో తెలిసిపోయింది!

-

స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన “పుష్ప ది రైజ్ సినిమా థియేటర్స్ వద్ద సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఫస్ట్ పార్ట్ సక్సెస్ తో సెకండ్ పార్ట్ ను అంతే జోష్ లో గ్రాండ్ గా తెరకెక్కించేందుకు మూవీ యూనిట్ కృషి చేస్తుంది. ఈ క్రమంలోనే సెకండ్ పార్ట్ అప్డేట్స్ ని తెలుసుకునేందుకు నార్త్ టు సౌత్ వరకు ఉన్న బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అందుకు తగ్గట్లుగానే ఛాన్స్ దొరికినప్పుడల్లా క్రేజీ అప్డేట్స్ తో ముందుకు వస్తుంది మూవీ యూనిట్. ఇటీవల రష్మిక మందన పుట్టినరోజు సందర్భంగా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ని వదిలిన మూవీ యూనిట్.. తాజాగా తిరుపతి జైలు నుంచి బుల్లెట్ గాయాలతో తప్పించుకున్న పుష్ప ఎక్కడున్నాడు? అంటూ అందరిలో ఆసక్తిని రేకెత్తించారు. దీంతో ప్రస్తుతం బన్నీ ఫ్యాన్స్, ఆడియన్స్ లో “where is Pushpa” అనే ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో తాజాగా ఈరోజు సాయంత్రం పుష్ప ఎక్కడున్నాడు అనేది రివిల్ చేసింది మూవీ యూనిట్.

వీడియో మొదలవ్వగానే ఓ న్యూస్ ఛానల్ లో ” తిరుపతి జైలు నుండి బుల్లెట్ గాయాలతో తప్పించుకున్న పుష్ప.. ఆ ప్రయత్నంలో పోలీసులు పుష్పపై పది రౌండ్లు కాల్పులు జరిపగా అతడు తీవ్రంగా గాయపడ్డాడు” అంటూ అందరిలో ఓ టెన్షన్ ని క్రియేట్ చేసింది ఈ వీడియో. ఆ తరువాత శేషాచలం అడవులలో పుష్ప గురించి కూంబింగ్ మొదలుపెడతారు. ఆ తరువాత బాక్రాపేట్ కొండపై పుష్ప దుస్తులు దొరికినట్లుగా రివిల్ చేశారు.

పోలీసుల కాల్పుల్లో ఏకంగా పుష్ప చనిపోయాడు అన్న ఆసక్తిని రేకెత్తించారు. ఇక చివరిలో అటవీ ప్రాంతంలో పులుల జాడ తెలుసుకోవడం కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో పుష్పని చూపించి సినిమాపై విపరీతమైన క్యూరియాసిటీని పెంచేసింది మూవీ యూనిట్. ఆ వీడియోలో పులి కెమెరా ముందుకి రావడం.. పుష్పని చూసి పులి రెండు అడుగులు వెనక్కి వేయడం.. అప్పుడు వచ్చే డైలాగ్, పుష్ప లుక్స్ తో పుష్ప బతికే ఉన్నాడని రివిల్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news