వారెవ్వా.. ఇది కదా అసలైన అందం అంటే.. త్రిష నీ అందానికి జోహారు..!

-

తమిళ తలైవిగా గుర్తింపు తెచ్చుకున్న స్టార్ బ్యూటీ త్రిష గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హీరోలలో వయసు పెరిగే కొద్దీ అందం పెరుగుతున్న మహేష్ బాబు గురించి చెబితే.. హీరోయిన్లలో వయసు పెరిగే కొద్దీ అందాన్ని మరింత రెట్టింపు చేస్తున్న త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇండస్ట్రీలోకి వచ్చే దాదాపు 17 సంవత్సరాలకు పైగానే అవుతున్నా అంతే అందంతో.. వన్నె చెరగని సోయగం ఆమె సొంతం. తెలుగులో వర్షం సినిమాతో తన హవా మొదలైంది అని చెప్పాలి.

ఆ తర్వాత స్టార్ హీరోలు అందరితో కూడా ఆడి పాడిన ఈమె ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇక అప్పటి నుంచి మళ్లీ వెనుతిరిగి చూసుకోలేదు తన అందంతో చిలిపితనంతో ఎంతో మందిని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది.39 ఏళ్ల వయసులో కూడా ఇంకా పెళ్లి అనే పదానికి దూరంగా ఉన్న ఈమెకు ఇప్పుడు వరుసగా అద్భుతమైన ఆఫర్లు వస్తున్నాయి. ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వం సినిమాలో నటించిన తర్వాత ఈమెకు మంచి విజయాలు లభిస్తున్నాయని చెప్పాలి. ఈరోజు ఈ సినిమా సీక్వెల్ కూడా విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా తన అందాలతో మరొకసారి ఆకట్టుకుంది త్రిష.

తాజాగా ఈ సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో తన గ్లామర్ తో మైకం తెప్పిస్తోంది చీరకట్టులో చంద్రబింబంలాగా మెరిసిపోతోంది ఈ అమ్మడు. స్లీవ్ లెస్ బ్లౌజులో ఆమె ఇస్తున్న ఫోజులు చూస్తే ఎవరైనా సరే తమను తాము మైమరిచిపోవడం ఖాయం.ఈమె వయసు 39 లేక స్వీట్ 16 నా అన్న అనుమానం కలగక మానదు. వర్షం అతడు చిత్రాల సమయంలో ఎలా ఉండేదో ఇప్పుడు ఆమె అందం అలాగే ఉంది అంటూ నేటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Trisha Krishnan👑 (@trishkrish_583)

Read more RELATED
Recommended to you

Latest news