Alia Bhatt : ఫిల్మ్​ఫేర్ అవార్డ్​లో ఆలియా భట్ సందడి.. బ్లాక్ డ్రెస్​లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్​గా..

-

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ మరోసారి ట్రెండింగ్​లోకి వచ్చేసింది. ఈ బ్యూటీ తాజాగా ఫిల్మ్ ఫేర్ అవార్డు ఈవెంట్​లో పాల్గొంది. ఈ షోలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్​గా నిలిచింది. ఈ ఈవెంట్​కు ఆలియా బ్లాక్ డ్రెస్సులో కనిపించింది.

బ్లాక్ లాంగ్ ఫ్రాక్​లో కోల్డ్ షోల్డర్ ఔట్​ఫిట్​లో ఆలియా చాలా ట్రెండీగా కనిపించింది. ఈ బ్యూటీ తల్లయినా కూడా.. సూపర్ ఫిట్​గా కనిపించి అందర్నీ సర్​ప్రైజ్ చేసింది. ప్రస్తుతం ఆలియా ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఫిల్మ్ ఫేర్ ఈవెంట్​కు హాజరైన ఆలియాకు గంగూబాయి కాఠియావాడి సినిమాకు గానూ ఉత్తమ కథానాయిక అవార్డు లభించింది. ఈ భామ ఆ సినిమాలో వేశ్యగా నటించిన విషయం తెలిసిందే. ఆ చిత్రం ఎంత హిట్ అయిందో కూడా మనం చూసిందే. ఈ మూవీలో ఆలియా నటనకు ప్రేక్షకులే కాదు.. విమర్శకులు కూడా ఫిదా అయ్యారు. గంగూభాయిగా ఆలియా నటన, డైలాగ్ డిక్షన్​ అందర్నీ మెస్మరైజ్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news