సాధారణ ఎన్నికలను తలపిస్తూ మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఎలక్షన్స్ జరిగాయి. 800 మంది సభ్యులు ఉన్న మా లో ఈసారి అధ్యక్ష పదవికి శివాజి రాజాతో పాటుగా నరేష్ కూడా పోటీలో దిగారు. ఎవరికి వారు ఆర్టిస్టులకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి ప్రచారం అయితే చేశారు. ఇదవరకు ఏకగ్రీవంగా ఎంపిక చేసే మా అధ్యక్ష పదవికి ఇప్పుడు రసవత్తరంగా పోటీ నెలకొంది.
అయితే ఫైనల్ గా ఆదివారం జరిగిన మా ఎన్నికల్లో ఏ ప్యానెల్ కు అందరు ఓటేయడం జరిగింది అన్నది సస్పెన్స్ గా సాగింది. రాత్రి 8 గంటలకే నూతన అధ్యక్షుడుని ప్ర్టకటించాల్సి ఉండగా రాత్రి 11 అవుతున్నా ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. 745 ఓట్లు ఉన్న మా ఎన్నికల్లో ఎప్పుడూ లేనిది 473 ఓట్లు పోలైనట్లు తెలుస్తుంది. అయితే ఆదివారం సాయంత్రానికి రిజల్ట్ తెలుస్తుంది అనుకుంటే అది మాత్రం సస్పెన్స్ లో ఉంచారు. ఇక స్టార్ హీరోలెవరు ఈ ఓటింగ్ కు రాలేదని తెలుస్తుంది. నరేష్ కు సపోర్ట్ గా మహేష్ వస్తాడని అనుకోగా మహేష్ కూడా రాలేదు. ప్రభాస్, ఎన్.టి.ఆర్, రాం చరణ్ వంటి స్టార్స్ కూడా మా ఎలక్షన్స్ లో పాల్గొనలేదు. చిరంజీవి నాగార్జున ఒకే కారులో వచ్చి ఓటు వేసి వెళ్లడం విశేషం.