సలార్ లో కాజల్ స్టెప్పులేస్తుందా?

-

టాలీవుడ్ లో చాలా మంది అభిమానులు ఎదురు చూసే మూవీగా నిలిచింది యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సలార్ (Salaar) మూవీ. ఈ మూవీని కన్నడ నటుడు యశ్ తో భారీ బ్లాక్ బాస్టర్ అందించిన ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు. ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ 2 కూడా చేస్తున్నాడు. ఈ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కేజీఎఫ్ సినిమాలో చెప్పని అనేక ప్రశ్నలకు ఇందులో సమాధానం దొరుకుతుందేమోనని ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. ఇక యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలో అందాల ముద్దుగుమ్మ విశ్వనాయకుడిగా పిలవబడే కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ నటిస్తుందని చిత్ర వర్గాలు ప్రకటించేశాయి. మొన్నా మధ్య రామగుండం, గోదావరి ఖని బొగ్గు గనుల్లో హీరో ప్రభాస్ మీద కొన్ని సీన్లను చిత్రీకరించారు. సినిమా షూటింగ్ షరవేగంగా సాగుతున్న తరుణంలో కరోనా మహమ్మారికి ఈ స్పీడుకు బ్రేకులేసింది.

సలార్ /Salaar
సలార్ /Salaar

ఇక తాజాగా ఈ మూవీ గురించి కొత్త న్యూస్ ఒకటి ఫిలిం సర్కిళ్లలో తెగ హల్ చల్ చేస్తుంది. అదే సలార్ మూవీలో టాలీవుడ్ చందమామ ప్రత్యేక గీతం చేస్తుందట. ఈ బ్యూటీ ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ చిత్రంలో ఐటెం సాంగ్ చేసి అందర్నీ మెప్పించింది. ఇక తాజాగా ఈ మూవీలో కూడా ప్రత్యేక గీతంలో ఆడి పాడేందుకు సిద్ధమైందనే వార్తలు వినిపిస్తున్నాయి. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజల్ తో ఐటం సాంగ్ చేపిస్తే… అదనపు ఆకర్షణ వస్తుందని మేకర్స్ భావిస్తున్నారట. కాజల్ ప్రభాస్ అప్ కమింగ్ మూవీలో స్పెషల్ సాంగ్ లో కనిపించనుందనే వార్తలు నిజమో కాదో తెలియాలంటే చిత్ర బృందం నుంచి అఫీషియల్ ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news