సాయి పల్లవి సినిమాలకు గుడ్ బై చెప్పి ఆ పని చేయనుందా..!!

-

టాలీవుడ్ లో హీరోయిన్ సాయి పల్లవి తన అందం, అభినయంతో, నటనకు ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ లేడీ సూపర్ స్టార్ గా కూడా పేరు సంపాదించింది. ఎలాంటి ఎక్స్పోజింగ్ చేయకుండా పలు సినిమాలలో నటించడంతో ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ భారీ గానే పెరిగిపోయిందని చెప్పవచ్చు. తనకు నచ్చని పాత్రకు కొన్ని కోట్ల రూపాయలు ఆఫర్ ఇచ్చినా కూడా నో అని చెప్పేస్తూ ఉంటుంది సాయి పల్లవి. ఏ సినిమా చేసిన ఎలాంటి పాత్రలో కనిపించిన అది తనకు నచ్చితేనే చేస్తుందని చెప్పవచ్చు.

- Advertisement -

తనకి కథ నచ్చితే రెమ్యూనరేషన్ తో పని లేకుండానే చేస్తానంటుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ప్రస్తుతం ఏ సినిమాలో నటించకుండా కేవలం తన కుటుంబంతో కలిసి బాగా ఎంజాయ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్ గా ఉండదు. దీంతో సాయి పల్లవి మీద పలు రకాలుగా వార్తలు వినిపించాయి. అయినా కూడా వాటి మీద ఎప్పుడు స్పందించలేదు.సాయి పల్లవి సినిమాలలోనే కాకుండా డాక్టర్ చదువుతున్న సంగతి అందరికీ తెలిసిందే.డాక్టర్ చదువు మధ్యలో సినిమాల అవకాశాలు రావడంతో ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే చదువు కాస్త డిస్టర్బ్ అయిందని చెప్పవచ్చు.

అయినా కూడా ఎలాగోలాగా కష్టపడి డాక్టర్ పట్టా సంపాదించింది. ఇప్పుడు దాంతోనే సొంతగా ఒక ఆసుపత్రి నిర్మించే ప్లాన్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది సాయి పల్లవి.తన ఆసుపత్రి నిర్మాణం కోసం కావాల్సిన అనుమతుల కోసం తిరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కోయంబత్తూర్ లో ఒక పెద్ద ఆసుపత్రి నిర్మించి ప్రజలకు సేవ చేయాలని ఎప్పటినుంచో అనుకుంటుందట సాయి పల్లవి. ఈ క్రమంలోనే ఆసుపత్రి పనులను వీలైనంత త్వరగా ప్రారంభించాలని చూస్తోంది ఈ ముద్దుగుమ్మ. దీంతో సాయి పల్లవి ఇక సినిమాలకు గుడ్ బై చెప్పబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంపై సాయి పల్లవి క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...