లిప్ లాక్స్ అంటే సినిమా వదులుకుంటుందా …?

-

ప్రస్తుతం ప్రపంచంలో కరోనా వైరస్ హడలించేసింది. మనిషికి మనిషికి కాస్త దూరం పెంచేసింది. పక్కవాడు బావుండాలని కోరుకునేలా చేసింది. అయితే లాక్ డౌన్ తర్వాత షూటింగ్ ప్రారంభం కాబోతుంది. పెండింగ్ లో చాలా సినిమాలు షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంటున్నాయి. ఇప్పుడిప్పుడే లాక్ డౌన్ సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సినిమా షూటింగులు జరుపుకునేందుకు అనుమతి ఇచ్చారు తెలంగాణ ప్రభుత్వం. అయితే కరోనా నిబంధనలు తప్పని సరి అని స్పష్టం చేశారు. ఇక ఈ మధ్య కాలంలో మన తెలుగు సినిమాలలోను ముద్దు సీన్లు.. రొమాంటిక్ సీన్లు తప్పనిసరిగా అయిపోయాయి.

 

చిన్న సినిమా నుండి స్టార్ హీరోల సినిమాల వరకు దాదాపు అన్ని సినిమాలలో ముద్దు సీన్స్ ఉంటున్నాయి. ప్రేక్షకులు వాటిని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే కరోనా దెబ్బతో ఇప్పటి నుంచి సినిమాలలో ముద్దు సీన్లు, బెడ్ రూం సీన్లు ఉండకపోవచ్చని అంటున్నారు. కరోనా కారణంగా ఇలాంటి సన్నివేశాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వదని మాట్లాడుకుంటున్నారు. ఒకరకంగా ఇది సేఫ్ అన్న భావన కూడా చాలామందిలో ఉంది. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ యంగ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి రొమాంటిక్ సీన్స్, లిప్ లాక్స్ మీద సంచలన వ్యాఖ్యలు చేసింది.

లాక్ డౌన్ తరువాత నేను ముద్దు సీన్లలో నటించనని స్ట్రెయిట్ గా చెప్పేస్తోంది లావణ్య. అయితే రీసెంట్ గా సినిమాలో పాత్ర డిమాండ్ చేస్తే బికినీ వేసుకోవడానికి సిద్ధమని చెప్పిన లావణ్య ఇప్పుడు ముద్దు సీన్స్ లో నటించనై చెప్పడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. ఒకవేళ తప్పనిసరి అంటే ఆ సినిమా వదులుకుంటుందా చూడాలి. ప్రసుత్తం లావణ్య ఏ1 ఎక్స్ ప్రెస్, చావు కబురు చల్లగా సినిమాలు చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news