అదీ అస‌లు విష‌యం.. డొక్కు విమానం కాబ‌ట్టే కూలింది..!

-

పాకిస్థాన్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ)కు చెందిన ఎయిర్‌బ‌స్ 320 విమానం ఇటీవ‌లే క‌రాచీ ఎయిర్‌పోర్టు ప‌రిస‌ర ప్రాంతాల్లో కుప్ప‌కూలిన విష‌యం విదిత‌మే. ఈ ప్ర‌మాదంలో విమాన సిబ్బంది స‌హా మొత్తం 107 మంది వ‌ర‌కు చ‌నిపోయారు. అయితే స‌ద‌రు విమానం 15 ఏళ్ల కింద‌టిద‌ట‌. దాన్ని 5 ఏళ్ల కింద‌ట చైనా ఈస్ట‌ర్న్ ఎయిర్‌లైన్స్ నుంచి పాకిస్థాన్ కొనుగోలు చేసింది. చాలా పాత‌బ‌డ్డ డొక్కు విమానం కావ‌డం వ‌ల్లే అందులో సాంకేతిక లోపం వ‌చ్చి కూలింద‌ని అస‌లు విష‌యం వెల్ల‌డైంది.

pia crashed flight was 15 year old

కాగా ఆ విమానం ల్యాండింగ్ గేర్ ఫెయిలైంది. దీంతో పైల్ బెల్లీ ల్యాండింగ్ చేయించేందుకు య‌త్నించాడు. కానీ అది కూడా కుద‌ర‌లేదు. ఇంజిన్ ఫెయిలైంది. ఫ‌లితంగా 107 మంది ప్రాణాలు గాల్లో క‌లిసిపోయాయి. నిజానికి ఆ విమానాన్ని 2004లో త‌యారు చేశార‌ట‌. అనంత‌రం దాన్ని 10 ఏళ్ల పాటు చైనా ఈస్ట‌ర్న్ ఎయిర్‌లైన్స్ వారు వాడారు. దాన్ని ఆ త‌రువాత అక్టోబ‌ర్ 2014లో పీఐఏ కొనుగోలు చేసింది. అప్ప‌టి నుంచి ఆ విమానాన్ని న‌డిపిస్తున్నారు. కానీ అది పాత విమానం క‌నుక అందులో సాంకేతిక లోపం వ‌చ్చి కూలిపోయింది.

ఇక ఈ ప్ర‌మాదంలో ఇప్ప‌టి వ‌ర‌కు 41 మంది మృత‌దేహాల‌ను వెలికితీశారు. మ‌రో 3 రోజుల్లో పూర్తి స్థాయిలో శ‌క‌లాల‌ను క్లియ‌ర్ చేస్తామ‌ని అధికారులు తెలిపారు. కాగా ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు బ‌తికే ఉన్న‌ట్లు తెలిసింది. వారి వివ‌రాల‌ను అధికారులు వెల్ల‌డించ‌లేదు.

Read more RELATED
Recommended to you

Latest news