44 ఏళ్ళ ప్రాయంలో అలాంటి పనికి సిద్ధమైన సిద్దార్థ్.. సక్సెస్ అవుతాడా..?

-

ప్రముఖ కోలీవుడ్ హీరో సిద్ధార్థ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇకపోతే ఈయన 44 ఏళ్ల ప్రాయంలో మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకోబోతున్నట్లు సమాచారం. సాధారణంగా మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ అనేది చిన్న వయసు నుంచి శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది .ఎందుకంటే ఆ వయసులో కాళ్లు, చేతులు వాటి తాలూకా కీళ్లు కూడా లేతగా ఉండడం వల్ల మార్షల్ ఆర్ట్స్ శిక్షలకు అనుగుణంగా వంగడానికి వీలుంటుంది. అది ఎంతో కఠోరమైన శిక్షణ.. మనసుని ఏకాంతం చేసుకుని మనిషి ఎంతో దృష్టి సారిస్తే తప్ప సాధ్యం కాని విద్య అది ..అలాంటిది పవన్ కళ్యాణ్ కూడా మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకున్న వారే.

చిన్న వయసులోనే ఆయనకు విద్యపై ఆసక్తి కలగడంతో ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకొని మరి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు సిద్ధార్థ్ 44 సంవత్సరాల వయసులో మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకున్నట్లు వెల్లడించారు తాజాగా ఆయన టక్కర్ అనే సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
కార్తీక్ జి క్రిష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా తెలుగు, తమిళ్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఇక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సిద్ధార్థ కూడా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నట్లు స్పష్టం చేశాడు. ఇప్పటివరకు లవర్ బాయ్గా, చాక్లెట్ బాయి గా చూసిన ప్రేక్షకులు మొదటిసారి యాక్షన్ హీరోగా చూస్తారని ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ను ఇస్తోంది అని తెలిపారు సిద్ధార్థ్. ఇప్పటికే ఒక ప్రత్యేకమైన జోనర్ సినిమాలే చేశాను ఇక పాత ఇస్తే ఆరంభం నుంచి చివరి వరకు ఒకేలా ఉంటుంది అందుకే ఈసారి నా పాత్రలలో మార్పులు చేశాను అంటూ తెలిపారు సిద్ధార్థ్. మరి ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news