ఇకనైనా ఈ ముద్దుగుమ్మలు మారుతారా..?

-

ఆకట్టుకొనే అందం నటన ఉన్నప్పటికీ కొంతమంది హీరోయిన్లు పెద్దగా సక్సెస్ కాలేకపోతూ ఉంటారు. అలాంటి లిస్టులో మన టాలీవుడ్ లో చాలామందే ఉన్నారు. ఇలా ముందు వరుసలో ఉన్న హీరోయిన్ ఎవరంటే సాయి పల్లవి అని చెప్పవచ్చు. ఫిదా చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ మొదటి చిత్రంతోనే అందం, అభినయంతో, నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా కుర్రాలలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకుంది. వరుస సినిమాలతో బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మ గత కొద్దిరోజుల నుంచి సినిమాలు చేయకుండా తగ్గించేసింది.

ఇక ఈ ఏడాది విరాటపర్వం, గార్గి సినిమాలతో పర్వాలేదు అనిపించుకుంది. కానీ ఆ తర్వాత ఏ సినిమాలను ప్రకటించలేదు. దీంతో అభిమానులు కాస్త నిరుత్సాహ చెందుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ తర్వాత అన్నీ ఉన్న కెరియర్ పరంగా వెనుక పడ్డ హీరోయిన్లలో నివేద థామస్ కూడా ఒకరు. చైల్డ్ యాక్టర్ గా తన కెరీర్ ని మొదలుపెట్టి ఆ తర్వాత మలయాళ చిత్రాలతో హీరోయిన్గా మారింది. నాని నటించిన జెంటిల్ మేన్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది..

అతి తర్వాత ఎన్నో సినిమాలలో నటించి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. కానీ ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో పెద్దగా ఆవకట్టుకోలేక పోతోందని అభిమానులు తెలియజేస్తున్నారు. చివరిగా శాకిని డాకిని సినిమా విడుదలవ్వగా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ఈమె చేతిలో ఏ ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా లేదు. వీరి తరువాత అదే లిస్టులో ఉన్న హీరోయిన్ నాభ నాటేశా.

Nabha Natesh Sizzles In Red And Blue Half Saree!

నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఎన్నో చిత్రాలను నటించిన పెద్దగా క్రేజీ సంపాదించుకోలేదు.

ప్రస్తుతం ఈమె చేతిలో కూడా ఏ ఒక్క ప్రాజెక్టు కూడా లేదు. ఇక వేరే కాకుండా కేతికాశర్మ, అను ఇమ్మాన్యూయేల్, నివేద పేతురాజ్ తదితర హీరోయిన్లు ఉన్నారని చెప్పవచ్చు.మరి రాబోయే రోజుల్లో ఈ ముద్దుగుమ్మలు వరుస సినిమా ప్రాజెక్టులతో బిజీగా అవుతారేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news