మునుగోడు ఉప ఎన్నికలో ఫలితాలు వెల్లడిలో జాప్యం జరుగుతోందని ఇప్పటికే బీజేపీ ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే.. మధ్యాహ్నం 12 గంటలు కావస్తున్నా.. ఇప్పటి వరకు ఐదు రౌండ్లు ఫలితాలే వెల్లడి అయ్యాయి.. ఓవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏదో చేస్తుందనే అనుమానాలు బీజేపీ నేతలు వ్యక్తం చేస్తుండగా.. మరోవైపు.. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జాప్యంపైన అధికార టీఆర్ఎస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది.. రౌండ్లవారీగా ఎన్నికల కౌంటింగ్ ఫలితాలు వెల్లడి ఆలస్యం అవడంపైన ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి జగదీష్ రెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి మీడియాకి అధికారులు లీకులు అందిస్తున్నారన్న వార్తలపై ఎలక్షన్ కమిషన్ స్పందించాలని డిమాండ్ చేశారు.
ప్రతి రౌండ్ కౌంటింగ్ పూర్తయిన తర్వాత వెంటనే అధికారులు మీడియాకి స్వయంగా వివరాలు తెలిపాలని డిమాండ్ చేశారు మంత్రి జగదీష్ రెడ్డి.. కాగా, ఐదో రౌండ్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి 6162 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్రెడ్డికి 5245 ఓట్లు వచ్చాయి.. ఐదో రౌండ్లోనే టీఆర్ఎస్కు 917 ఓట్ల లీడ్ వచ్చింది.. మొత్తంగా ఐదు రౌండ్లు ముగిసే సరికి టీఆర్ఎస్కి 32,405, బీజేపీకి 30,975, కాంగ్రెస్ కి 10,055, బీఎస్పీకి 1,237 ఓట్లు వచ్చాయి.. ఇప్పటి వరకు టీఆర్ఎస్ ఆధిక్యం 1430 ఓట్లుగా ఉంది.