ఫ్యాన్స్ తాకిడి తట్టుకోలేక ఈవెంట్ కాన్సిల్ చేసిన బన్నీ.!

-

అల్లు అర్జున్ అంటే తెలుగు ప్రజలలో విపరీతమైన క్రేజ్ వుంది.ఇక పుష్ప తర్వాత తన ఫాలోయింగ్ మామూలుగా లేదు.సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన‘పుష్ప’ సినిమా ఊహించని  వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ హిట్టయిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో పాటలు , స్టైల్స్ అన్ని విపరీతంగా ఆదరణ పొందాయి. ఇప్పుడు పుష్ప 2కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

రీసెంట్ గా పుష్ప 2 మూవీ షూటింగ్ విశాఖ పట్టణంలో స్టార్ట్ చేసారు. అల్లు అర్జున్ ఈ చిత్రం షూటింగ్ కు హజరు అవుతున్నారు. వైజాగ్ వచ్చిన బన్నీ కి ఆయన ఫ్యాన్స్ ఘన స్వాగతం పలికారు. ఇక బన్నీ కూడా దగ్గరే ఉండడం తో ఒక ఫ్యాన్ మీట్ ఏర్పాటు చేశారు. ఇక తమ ప్రాంతంలో అభిమాన హీరోను కలిసే అవకాశం రావడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

అదీ కాక సోషల్ మీడియాలో ఈ న్యూస్ రావటం తో చాలా మంది ఫ్యాన్స్ ఈవెంట్ దగ్గరకు చేరారు.అయితే కొందరు అత్యుత్సాహానికి పోవడంతో కార్యక్రమం గందరగోళంగా మారింది. ఫ్యాన్స్ ను కంట్రోల్ చేయడం అసాధ్యంగా మారడంతో ఫొటోషూట్ నే రద్ధు చేసినట్టు తెలుస్తోంది. దీనిపై ఎంతో కష్టపడి వచ్చిన బన్నీ ఫ్యాన్స్ మాత్రం  నిరాశ వ్యక్తం చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news