‘వరల్డ్ ఫేమస్ లవర్’ కి ఎంత లాస్ తెలుసా ? ఈ న్యూస్ చదివితే ఎవ్వడూ దేవరకొండ తో సినిమా తీయడు ??

634

క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నటించిన సినిమా ‘వరల్డ్ ఫేమస్ లవర్’. వరుస పరాజయాలతో కెరియర్ లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విజయ్ దేవరకొండ కి ఈ సినిమాతో కచ్చితంగా హిట్ పడుతుందని విజయ్ దేవరకొండ అభిమానులు అనుకున్నారు. ముఖ్యంగా ఎప్పుడూ ఎన్నడూ లేని విధంగా సినిమాలో నలుగురు హీరోయిన్లు ఉండటంతో పైగా లవ్ స్టోరీ కావడంతో కచ్చితంగా ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా తో తిరిగి విజయ్ దేవరకొండ హిట్ ట్రాక్ ఎక్కడం గ్యారెంటీ అనుకున్నారు. Image result for world famous lover

దీంతో భారీ అంచనాల మధ్య విడుదలైన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా దారుణమైన ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. మొదటిరోజు అట్టర్ ఫ్లాప్ టాక్ రావడంతో సినిమా కొన్న బయ్యర్లు సగానికి సగం నష్టాలపాలయ్యారు. ఇండస్ట్రీ నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 30 కోట్లు చేయగా…మొదటి వారంలో కేవలం 8 కోట్లు మాత్రమే రాబట్టినట్లు ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.

 

దీంతో సినిమా నిర్మాణం కోసం పెట్టుబడి పెట్టిన డబ్బు సగానికి పైగానే నష్టాలు పాలైనట్లు తెలుగు సినిమా రంగంలో వార్తలు గట్టిగా వినబడుతున్నాయి. దీంతో సినిమాకి వచ్చిన నష్టాలు వార్తల గురించి ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు నెక్స్ట్ విజయ్ దేవరకొండ తో కచ్చితంగా ఎవరూ లవ్ స్టోరీ సినిమాలు తీయరు అని కామెంట్ చేస్తున్నారు.