తెలంగాణాలో ఇప్పుడు బిజెపి కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. అధికారంలో ఉన్న తెరాస ను పక్కన పెట్టి ఒకరిపై ఒకరు బిజెపి నేతలు, కాంగ్రెస్ నేతలు చేసుకుంటున్న ఆరోపణలు ఇప్పుడు ఆశ్చర్యంగా మారాయి. బలపడాల్సిన సమయంలో అనవసరంగా సమయం వృధా చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో మేము ఎక్కువ నిధులు ఇచ్చామంటే మేము ఎక్కువ ఇచ్చామని ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు.
అంతిమంగా తెరాస పార్టీ లాభపడింది. ఇప్పుడు కూడా దాదాపుగా అదే జరుగుతుంది. ఇప్పట్లో ఎన్నికలు లేవు. బలపడాల్సిన అవసరం ఉంది. కాని రైలు గురించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు కాంగ్రెస్ నేతలు. తాజాగా మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి కొన్ని కామెంట్స్ చేసారు. ఇటీవల యెర్ర బస్సు తప్పా రైలు తెలియదు తెలుగు వారికి అన్నట్టు మాట్లాడారు కిషన్ రెడ్డి.
దీనిపై స్పందించిన రేవంత్ రెడ్డి… అవగాహన లేని వ్యక్తిని మోడీ కేంద్ర మంత్రిని చేసారని, ఆయనకు కనీస అవగాహన లేదని, ఆయన ఎర్ర బస్సు ఎక్కి వచ్చి కేంద్ర మంత్రి అయ్యారు అంటూ మాట్లాడారు. కిషన్ రెడ్డి పుట్టక ముందే రైళ్ళు తిరిగాయని, ఆయనకు కనీస అవగాహన లేదని ఎద్దేవా చేసారు. ఆయనను చూస్తే తనకు జాలి వేస్తుంది అన్నారు రేవంత్ రెడ్డి. తప్పుడు ప్రచారాలు మానుకోవాలని సూచించారు.