క్లీన్ కంటెంట్ ఉంటే చాలు! ఐటమ్ సాంగ్ అక్కరలేదు గురూ.!

-

ఈ రోజుల్లో జనాలు థియేటర్లు కు రావాలంటే నే భయపడుతున్న పరిస్థితి. థియేటర్ లో టిక్కెట్ రేట్స్ తో పాటు స్నాక్స్ రేట్స్ కూడా ఒక కారణం. సరే అంతా భరించి వెళితే అక్కడ ఫ్యామిలీ, పిల్లలు తో కలసి సినిమా చూసే సీన్లు ఉండవు.అందుకే ఫ్యామిలీస్ చాలా వరకు థియేటర్స్ కు వెళ్ళడమే మానేశాయి. కాని క్లీన్ కంటెంట్ తో కూడా హిట్ కొట్టచ్చని ఒక చిన్న సినిమా నిరూపిస్తోంది.

కలర్ ఫొటో సినిమాతో హీరోగా మారిన సుహాస్ నటించిన తాజా చిత్రం రైటర్ పద్మభూషణ్ గురించే అనిప్రత్యేకంగా చెప్పాల్సిన అసరం లేదు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వస్తోంది. హిట్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా విడుదలైన రెండ్రోజుల్లోనే 1.80 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇంకా వారం రోజులు కూడా కాలేదు కాబట్టి ఇంకా వసూళ్ళు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.

ఇక ఈ చిత్రం  యు ఎస్ ఏ లో కూడా అదరగొడుతోంది.మరి ఈ చిత్రం అక్కడ లేటెస్ట్ గా 2 లక్షల డాలర్స్ పైగా వసూళ్ళు సాధించింది . దీనితో ఈ సినిమా ఎంతలా అలరిస్తుందో అర్ధం చేసుకోవచ్చు. అలాగే ఈ సినిమాకి వసూళ్ల పరంగా సూపర్  అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో ఆశిష్ విద్యార్థి, నటి రోహిణి కీలక పాత్రల్లో నటించగా లహరి ఫిల్మ్స్ వారు మరియు ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహించారు

 

Read more RELATED
Recommended to you

Latest news