Yashoda Teaser : యశోద టీజర్ ప్రోమో రిలీజ్..అదరగొట్టిన సామ్

-

బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత..అక్కినేని నాగచైతన్యతో డైవోర్స్ తర్వాత తన ప్రొఫెషనల్ కెరీర్ పైన ఫుల్ ఫోకస్ పెట్టింది. వరుస సినిమాల్లో ఫుల్ బిజీగా ఉంది ఈ టాలెంటెడ్ హీరోయిన్. ‘పుష్ప’ చిత్రంలో ఐటెం సాంగ్ చేసిన సమంత..వినూత్నమైన స్టోరిలను ఎంచుకుని పిక్చర్స్ చేస్తోంది. కాగా,ప్రస్తుతం సమంత నటిస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘‘యశోద’. ఈ ‘యశోద’ పిక్చర్ లో వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్, ఉన్నీ ముకుంద‌న్ కీలక పాత్రలు పోషిస్తుండగా, మెలోడీ బ్రహ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు.

శ్రీదేవీ మూవీస్ బ్యానర్ పై శివ‌లెంక కృష్ణ ప్రసాద్ పిక్చర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ మూవీ..తెలుగుతో పాటు హిందీ, త‌మిళ్, కన్నడ, మ‌ల‌యాళం భాష‌ల్లో ఈ ఏడాది ఆగ‌స్టు 12న విడుద‌ల చేయాల‌ని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే.. వినాయక చవితి నేపథ్యంలో ఈ సినిమా నుంచి బిగ్‌ అప్డేట్‌ వచ్చింది. ఈ సినిమా టీజర్‌ను సెప్టెంబర్‌ 9 వ తేదీన రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే.. ఇవాళ ఈ టీజర్‌ కు సంబంధించిన ప్రోమోను రిలీజ్‌ చేశారు. ఇందులో సమంత.. ఓ పావురాన్ని పట్టుకుంటూ కనిపించింది. ఈ సీన్‌ అందరినీ ఆకట్టుకుంటోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news