కొరటాల శివతో మళ్లీ యంగ్ టైగర్..!

-

మిర్చి నుండి భరత్ అనే నేను వరకు దర్శకుడిగా సూపర్ సక్సెస్ అందుకున్న దర్శకుడు కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో తన తర్వాత సినిమా ప్లాన్ చేస్తున్నాడు. డిసెంబర్ నుండి సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా 2019 దసరాకు రిలీజ్ చేస్తారట. ఇక ఇదే కాకుండా కొరటాల శివ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడట.

తన కెరియర్ మొదట్లో సపోర్ట్ గా నిలిచిన స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ నిర్మాణంలో ఈ సినిమా ఉండబోతుందట. ఎన్.టి.ఆర్ కూడా కొరటాల శివతో మరో సినిమా చేసేందుకు రెడీ అన్నాడట. ఆల్రెడీ ఈ ఇద్దరి కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ సినిమా వచ్చి సూపర్ హిట్ అందుకుంది. చిరంజీవి సైరా తర్వాత కొరటాల శివ సినిమా చేస్తుండగా ఆ తర్వాత ఎన్.టి.ఆర్ సినిమా ఉంటుందట.

మొత్తానికి వరుస క్రేజీ ఆఫర్స్ తో కొరటాల శివ స్టార్ డైరక్టర్ గా ఇమేజ్ పెంచుకుంటున్నాడు. ఇప్పటివరకు తను తీసిన 4 సినిమాలు హిట్ అవడంతో స్టార్ హీరోలు కూడా అతని సినిమా అంటే మరోమాట లేకుండా ఓకే అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news