హ్యాపీ వెడ్డింగ్.. శాటిలైట్స్ కాపాడింది…!

-

మెగా వారసురాలు నిహారిక హీరోయిన్ గా చేసిన సెకండ్ మూవీ హ్యాపీ వెడ్డింగ్. నిర్మాత ఎం.ఎస్ రాజు తనయుడు సుమంత్ అశ్విన్ హీరోగా నటించాడు. ముద్దపప్పు ఆవకాయ్ వెబ్ సీరీస్ డైరెక్ట్ చేసిన లక్ష్మణ్ కార్య ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులలో మిక్సెడ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. కలక్షన్స్ కూడా అంత బాగా ఏం లేవు.

యువి క్రియేషన్స్ వారు పబ్లిసిటీతో కలిపి ఈ సినిమాకు 3 కోట్ల బడ్జెట్ పెట్టారట. అయితే సినిమా డిజాస్టర్ టాక్ రాలేదు కాబట్టి శాటిలైట్ రైట్స్ బాగానే వెళ్లాయని తెలుస్తుంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా 3 కోట్ల దాకా శాటిలైట్ రేటు పలికిందట. ఈ లెక్కన సినిమా సేఫ్ ప్రాజెక్ట్ అన్నట్టే లెక్క. ఒక మనసు సినిమా తర్వాత నిహారిక చేసిన ఈ మలి ప్రయత్నం సక్సెస్ ఇవ్వకపోయినా సంతోషాన్ని మాత్రం ఇచ్చిందని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news