చైతు కెరియర్ లో హయ్యెస్ట్ బిజినెస్..!

-

అక్కినేని వారసుడు నాగ చైతన్య హీరోగా సక్సెస్ ఫుల్ డైరక్టర్ మారుతి డైరక్షన్ లో వస్తున్న సినిమా శైలజా రెడ్డి అల్లుడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగ వంశీ నిర్మిస్తున్న ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్ గా నటిస్తుంది. శివగామి రమ్యకృష్ణ కూడా సినిమాలో ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. కొన్నాళ్లుగా రిలీజ్ డేట్ కోసం చూసిన ఈ సినిమాను ఫైనల్ గా ఆగష్టు 31న రిలీజ్ ఫిక్స్ చేశారు.

ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా చైతు కెరియర్ లో ఎన్నడు లేని విధంగా హయ్యెస్ట్ గా అమ్ముడయ్యింది. ఆంధ్రాలో 9 కోట్ల దాకా రేటు పలికిన ఈ సినిమా నైజాం లో 6.5కోట్లు బిజినెస్ చేసిందట. ఇక సీడెడ్ లో 3.5 కోట్లు బిజినెస్ అయ్యిందట. మొత్తంగా 25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో శైలజా రెడ్డి అల్లుడు సత్తా చాటాడు.

చైతు నటించిన రారండోయ్ వేడుక చూద్దాం సినిమా తన కెరియర్ లో హయ్యెస్ట్ గా పాతిక కోట్ల కలక్షన్స్ తెచ్చింది. ఇక ఇప్పుడు ఆ రేంజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ అయ్యింది. మారుతి మార్క్ మూవీగా వస్తున్న ఈ శైలజా రెడ్డి అల్లుడు ఏమేరకు ప్రేక్షకుల మెప్పు పొందుతాడో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news