ఏజ్‌ తగ్గించే మెడిసిన్‌ కనిపెట్టేసిన శాస్త్రవేత్తలు.. ఇక నిత్య యవ్వనమే

-

సైంటిస్టులు ఏవేవో పరిశోధలను చేసి కొత్త కొత్త విషయాలను కనిపెడుతుంటారు. ఇవి తింటే క్యాన్సర్‌ వస్తుంది. ఇలా చేస్తే లైంగిక ఆరోగ్యం దెబ్బతింటుంది ఇలా. తాజాగా సైంటిస్టులు పరిశోధనలు చేసి నేడు జనాలకు బాగా కావాల్సిన ఒక మందును కనిపెట్టారు. అదే ఏజ్‌ తగ్గించుకునే మందు. వయసు మీద పడినా యవ్వనంగా కనిపించాలని జనాలు తెగ ట్రై చేస్తున్నారు. వాటి కోసం వేలకు వేలకు ఖర్చుపెడతారు. అలాంటి వాళ్లకు ఈ మెడిసిన్‌ వరమనే చెప్పాలి. హార్వర్డ్‌ యూనివర్సిటీకి చెందిన సైంటిస్ట్‌లు వయసుని తగ్గించుకునే మందు కనిపెట్టారు.

anti-aging drug

రివర్స్ సెల్యులార్ ఏజింగ్ పేరుతో ఓ పరిశోధన చేసిన సైంటిస్ట్‌లు జులై 12న దీనికి సంబంధించిన వివరాలను ఓ జర్నల్‌లో ప్రచురించారు. మొత్తం ఆరు కెమికల్ కాక్‌టెయిల్స్‌ని కలిపి ఈ మందు తయారు చేశారట. ముందు ఎలుకపై ప్రయోగం చేసి ఆ తరవాత మనిషిపై కూడా ట్రై చేశారు. ఈ రెండు ప్రయోగాల్లోనూ ఫలితాలు ఊహించనట్టుగానే వచ్చాయి. వయసు తగ్గిపోయినట్టు స్పష్టంగా కనిపించింది. హార్వర్డ్‌ యూనివర్సిటీకి చెందిన ఓ రీసెర్చర్‌ ట్విటర్‌లో ఈ వివరాలు పోస్ట్ చేశారు.

“మా కొత్త పరిశోధనకు సంబంధించిన వివరాలు వెల్లడించడం చాలా గర్వంగా ఉంది. గతంలోనే మేం ఏజ్ రివర్సింగ్ సాధ్యమే అని చెప్పాం. జీన్ థెరపీతో చేయొచ్చని రుజువు చేశాం. ఈ సారి కెమికల్ కాక్‌టెయిల్స్‌తో మందు తయారు చేశాం. ఈ మందుతో శరీరమంతా యాక్టివేట్ అవుతుంది. వయసు తగ్గిపోతుంది” – హార్వర్డ్ రీసెర్చర్

ఈ కాక్‌టెయిల్‌లో దాదాపు 5-7 ఏజెంట్స్‌ ఉన్నాయని సైంటిస్టులు తెలిపారు. ఫిజికల్‌, మెంటల్ డిజార్డర్‌లకు ఇది దివ్యౌషధంగా పని చేస్తుందట దాదాపు మూడేళ్లుగా దీనిపై ప్రయోగాలు చేసిన తరవాతే నిర్ధరణకు వచ్చినట్లు సైంటిస్టులు పేర్కొన్నారు.

ఇక ఈ మందు మార్కెట్‌లో వస్తే.. హాట్ కేక్‌ కంటే ఫాస్ట్‌కు సేల్‌ అవుతుందేమో కదా..! ఎంతో మంది తమవయసుకంటే చిన్నగా కనిపించాలని ఎంతో కష్టపడుతున్నారు. హెల్టీ డైట్‌లు, వర్క్‌ అవుట్స్‌లు అబ్బో ఆ కథంతా వేరే ఉంటుంది. ముఖ్యంగా సెలబ్రెటీలకు వారి అందమే పెట్టుబడి కాబట్టి అందం విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటారు.

Read more RELATED
Recommended to you

Latest news