‘యాత్ర’ సెన్సార్.. క్లీన్ ‘యు’ ఇచ్చారు

-

వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథతో మమ్ముట్టి ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా యాత్ర. వైఎస్ పాదయాత్ర ముఖ్య నేపథ్యంగా చేసుకుని చేస్తున్న సినిమాగా యాత్ర స్పెషాలిటీ తెచ్చుకుంది. మళయాళ స్టార్ హీరో మమ్ముట్టి వైఎస్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ వైఎస్ అభిమానులకు వైసిపి పార్టీ కార్యకర్తలకు బాగా నచ్చింది. ఇక రాబోయే ఎలక్షన్స్ టార్గెట్ తో ఈ సినిమా వస్తుందని తెలుస్తున్నా ఈ సినిమాకు జగన్ తో ఎలాంటి సంబంధం లేదని అంటున్నారు.

70 ఎం.ఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో విజయ్ చిల్లా, శషి దేవిరెడ్డి ఈ సినిమా నిర్మించారు. ఫిబ్రవరి 8న ప్రపంచవ్యాప్తంగా యాత్ర రిలీజ్ అవనుంది. సినిమా సెన్సార్ కార్యక్రమాలను ముగించుకుంది. రెండు గంటల ఆరు నిమిషాల నిడివితో సినిమా వస్తుందట. సెన్సార్ నుండి క్లీన్ యు సర్టిఫికెట్ అందుకుంది యాత్ర మూవీ. రాజకీయనేతగా వచ్చి జననేతగా ఎదిగిన వైఎస్ జీవిత కథను ఆయన చేసిన మంచి పనులను ఈ సినిమాలో ప్రస్థావిస్తున్నారట. మరి ఏపి ఎన్నికల టైం లో ఇలాంటి సినిమా అంటే కచ్చితంగా టిడిపి పెద్ద మైనస్ అని చెప్పొచ్చు. సినిమా చివర్లో వైఎస్ జగన్ కనిపిస్తారని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version