అసలు యూనెస్కో గుర్తింపు వస్తే.. ఏమవుతుందో తెలుసా?

ఇటీవల మన వరంగల్‌ జిల్లాలోని రామప్ప టెంపుల్‌కు యూనెస్కో గుర్తింపు లభించింది. 800 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ కట్టడానికి ప్రపంచస్థాయిలో గుర్తింపు లభించడం ఆనందం. ధోలవీర్‌కు కూడా యూనెస్కో గుర్తింపు లభించింది. అయితే, ఇలా ప్రాచీన కట్టడాలకు గుర్తింపు లభిస్తే .. అసలు ఏం మారుతుంది… ఆ తర్వాత జరిగే పరిణామాలు ఏంటో మీకు తెలుసా? ఆ వివరాలు తెలుసుకుందాం.

  • వారసత్వ ప్రాంతాలు గుర్తింపు లభించడం వల్ల ఆక్రమణలు, పారిశ్రామికీకరణ నుంచి రక్షణ పొందుతాయి. ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో ప్రపంచ వ్యాప్తంగా ఇప్పట వరకు 878 ప్రదేశాలు ఉన్నాయి.
  • యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందేవి ఓ నిర్ణీత కాలంలో మావన విలువలలో వచ్చిన మార్పులతో పాటు అంతరించిపోయిన లేదా మనుగడలో ఉన్న నాగరికతను అవి ప్రతిబింబించాలి. అప్పుడు మాత్రమే ప్రపంచ వారసత్వ సంపదలో సంబధిత ప్రదేశం లేదా నిర్మాణం చోటు దక్కించుకుంటాయి.
  • మానవ చరిత్రలోని ముఖ్యమైన దశలను సూచించే విధంగా నిర్మితమైన కట్టడాలు ముఖ్యంగా తాజ్‌మహల్‌ ,మొఘలుల చరిత్ర వారి జీవన విధానం తెలియజేస్తుంది. వాస్తుశిల్పం – రామప్పదేవాలయం అద్భుత శిల్పనైపుణ్యం.
  • యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద గుర్తింపు పొందితే కలిగే మొదటి ప్రయోజనం ఆ ప్రాంతానికి పేరూ, ప్రచారం పెరిగి యాత్రికుల తాకిడి కూడా పెరుగుతుంది.
  • దీనివల్ల ఆయా దేశాలు ఆర్థికంగానూ లాభపడతాయి. ఇక ఈ ప్రాంతాల పరిరక్షణకు నిధులు పొందే సౌలభ్యం కలుగుతుంది. సంబంధిత ప్రదేశానికి చారిత్రక ప్రాముఖ్యం ఉందనే విషయం తెలియగానే దాన్ని రక్షించుకోవాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు. ముఖ్యంగా యుద్ధంలాంటి సమయాల్లో ఈ వారసత్వ సంపదల జోలికి సైన్యం రాదు.
  • ఇక ఆ ప్రాంతం మనుగడకు భద్రత ఏర్పడుతుంది. చరిత్రకు చెక్కు చెదరదు కూడా.