అక్షయ తృతీయ విశేషాలు.. ప్రాముఖ్యత.. కొటేషన్లు..

అక్షయ తృతీయ. భారతదేశంలోని హిందువులందరూ జరుపుకునే పండగ. ఈ రోజుని అదృష్టానికి, విజయానికి, భవిష్యత్తులో వచ్చే ఆనందాలకి గుర్తుగా జరుపుకుంటారు. వైశాఖ మాసంలో శుక్ల పక్షం మూడవ రోజున అక్షయ తృతీయ జరుపుకుంటారు. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్- మే నెలల మధ్య కాలంలో జరుపుకుంటారు. ఈ సంవత్సరం మే 14వ తేదీన అక్షయ తృతీయ జరుపుకుంటున్నారు. విశ్వంలోని సూర్యుడు, చంద్రుడు ఈ ప్రత్యేకమైన రోజున ఒకే రేఖలోకి వస్తారని చెప్పుకుంటారు.

అంతేకాదు ఈ ప్రత్యేకమైన రోజున వేద వ్యాసుడు మహాభారత రచనని మొదలెట్టాడని చెప్పుకుంటారు. విష్ణు దేవుడి ఆరవ అవతారమైన పరశురాముడి పుట్టినరోజుని కూడా ఈరోజే జరుపుకుంటారు. అన్నపూర్ణాదేవి ఈ రోజే జన్మించిందని నమ్ముతారు. శ్రీక్రిష్ణ భగవానుడు తన స్నేహితుడు సుదామాకి ఈ రోజు సాయం చేసాడని చెప్పుకుంటారు. అంతేకాదు మహాభారతం ప్రకారం పాండవులు రాజ్యాన్ని వదిలి వెళ్ళేటపుడు వాళ్ళకోసం శ్రీక్రిష్ణుడు అక్షయ పాత్ర ఇచ్చాడని, దానివల్ల ఆహారానికి, నీటికి ఎలాంటి ఇబ్బంది ఉండకుండా ఉంటుందని చెప్పుకుంటారు.

ఇంకా స్వర్గం నుండి గంగానది భూమికి వచ్చిందని రకరకాల నమ్మకాలు ఉన్నాయి. ఐతే ఈ ప్రత్యేకమైన రోజున మీ బంధువులతో పంచుకోవాల్సిన కొటేషన్లు ఏమిటో ఇక్కడ చూద్దాం.

“ఎప్పటికీ చెరిగిపోని ఆనందాన్ని, ఎప్పటికీ అలాగే ఉండిపోయే విజయాన్ని ఈ అక్షయ తృతీయ మీకు అందించాని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము”

“ఈ పవిత్రమైన అక్షయ తృతీయ రోజున మీ జీవనం మరింత మెరుగ్గా అయ్యేందుకు మీ తలుపులని తెరిచి ఉంచుకోండి. అక్షయ తృతీయ శుభాకాంక్షలు”

“మీకు మీ కుటుంబ సభ్యులందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు”