శబరిమలలో మొదలైన అయ్యప్ప దర్శనాలు

భారత్‌లోనే ప్రసిద్ధి గాంచిన కేరళలోని శబరిమలలో అయ్యప్ప స్వామి దర్శనాలు ప్రారంభమయ్యాయి. మండలం-మకరవిలక్కు వార్షిక యాత్ర సీజనులో భాగంగా ప్రధాన అర్చకుడు ఎన్‌.పరమేశ్వరన్‌ నంబూద్రి ఆధ్వర్యంలో కోవెల ద్వారాలను బుధవారం సాయంత్రం 5 గంటలకు తెరిచారు. కరోనా కారణంగా గత రెండేళ్లు రోజుకు 30 వేల మంది భక్తులనే అనుమతించారు.

 

ఈ ఏడాది స్వామి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్యపై ఎటువంటి పరిమితులు లేవని అధికారులు ప్రకటించారు. తొలిరోజు సుమారు 30 వేల మంది భక్తులు అయ్యప్పస్వామిని దర్శించుకున్నారని ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు కె.అనంతగోపన్‌ వెల్లడించారు. ఈ ఏడాది భక్తులు అధికంగా తరలిరానున్నందున అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.