ఇంటికే శబరిమల ప్రసాదం !

శబరిమల.. అయ్యప్ప అంటే భక్తులందరికీ అంతులేని విశ్వాసం. శ్రమకోర్చి మండలదీక్ష పట్టి స్వామిని దర్శించుకుంటారు. అయితే ఈసారి కోవిడ్‌తో అయ్యప్పమాల వేసుకున్నవారి సంఖ్య తగ్గింది. కానీ భక్తులకు మాత్రం లోపల ఏదో దిగులు స్వామిని చూడలేదని, స్వామి ప్రసాదం తీసుకోలేదని వారందరి దిగులు తీర్చడానికి శబరి దేవస్తానం వారు చేసిన పని గురించి తెలుసుకుందాం… శ్రీఅయ్యప్ప ప్రసాదం కావాల్సిన వారు సమీపంలోని తపాలాశాఖ కార్యాలయంలో సంప్రదించాలి. కేవలం రూ. 450 చెల్లించి ముందస్తుగా బుకింగ్ చేసుకోవాలి. పూర్తి వివరాలతో దరఖాస్తు పత్రంలో సరైన చిరునామా పొందుపర్చాలి. మకరజ్యోతి దర్శనం తర్వాత మీ ఇంటికి తపాలాశాఖ సిబ్బంది ప్రసాదం ప్యాకెట్ను వారం రోజుల్లో అందిస్తారు. అందులో అరవన ప్రసాదం, నెయ్యి, పసుపు, కుంకుమ, విభూది, అష్టోత్తర అర్చన ప్రసాదం ఉంటుందని తపాలాశాఖ పోస్టల్ సూపరింటెండెంట్ తెలిపారు.

శబరిమలైలో అయ్యప్ప స్వామి ప్రసాదం ఎంతో ప్రఖ్యాతిగాంచింది. ఈ క్రమంలోనే పోస్టల్ శాఖ కీలక నిర్ణయం తీసుకుని భక్తులకు అయ్యప్ప స్వామి ప్రసాదాన్ని పోస్టు ద్వారా గత కొన్ని రోజుల నుంచి డోర్ డెలివరీ చేస్తుంది. దీని కోసం దగ్గరలోని పోస్టాఫీసుకు వెళ్లి స్వామి ప్రసాదం పేరుతో 450 రూపాయలు చెల్లించాలి.. అంతే కాకుండా పూర్తి పేరు పూర్తి అడ్రస్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి, ఇక రిజిస్టర్ చేసుకున్నవారికి స్వామివారి ప్రసాదం తోపాటు అభిషేక నెయ్యి, పసుపు, కుంకుమ, విభూతి, డోర్ డెలివరీ అవుతాయి. ఈ అవకాశం జనవరి 15 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

– శ్రీ