ప్ర‌తి రోజు సూర్య నమస్కారాలు చేయ‌డం వ‌ల్ల ఇన్ని లాభాలు..?

-

మనిషికి ఎన్ని ఉన్నా ఆరోగ్యం ప్రధానం. అది సరిగా లేకుంటే అన్ని ఉన్నా వృథానే అనడంలో సందేహం లేదు. ఆరోగ్యం మహాభాగ్యం. ఇటువంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మన సంస్కృతిలో ఎన్నో ప్రక్రియలను మన పూర్వీకలు మనకు ఏర్పాటుచేశారు. యోగా, సూర్యనమస్కారాలు, నదీస్నానాలు, సముద్ర సానాలు, ఉపవాసాలు ఇలా పలు రకాలు ఉన్నాయి. అందులో అసలు ఖర్చులేకుండా ప్రతి ఒక్కరు ఆచరించడానికి వీలయ్యే వాటిలో సూర్యనమస్కారాలు మొదటిగా చెప్పుకోవచ్చు.

benefits of surya namaskar
benefits of surya namaskar

పన్నెండు భంగిమలతో చేసే సూర్య నమస్కారాలు గంటల తరబడి యోగా, ప్రాణయామం చేయలేని వారికి చక్కటి లాభాలు కలిగిస్తాయి. సాధారణంగా వివిధ ఆసనాలు, ప్రాణయామాలు చేసేవారు కూడా చివర్లోనో, మొదట్లోనో ఈ సూర్య నమస్కారాలు చేస్తుంటారు. అయితే, కేవలం సూర్య నమస్కారాలు చేసినా చాలా లాభాలు ఉన్నాయి. వాటి వివరాలు తెలుసుకుందాం….

యోగా మనదేశంలో పుట్టిన ఒక గొప్ప ప్రక్రియ. అయినా ఇప్పటికీ మనలో చాలా మందికి యోగా గురించి పెద్దగా ఏం తెలియదనే చెప్పాలి. అయితే ప్రస్తుతం దేశంలో గతంలో కంటే చాలా మంది యోగా చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందరికీ యోగా చేయడానికి సమయం, అవకాశాలు ఉండకపోవచ్చు అటువంటి వారికి సూర్య నమస్కారాలు అద్భుతమైన తరుణోపాయం అనడంలో అతిశయోక్తి లేదు.

సూర్యనమస్కారాలు

పన్నెండు భంగిమలతో చేసే సూర్య నమస్కారాలు చక్కటి లాభాలు కలిగిస్తాయి. సాధారణంగా వివిధ ఆసనాలు, ప్రాణయామాలు చేసే వారు కూడా చివర్లోనో, మొదట్లోనో ఈ సూర్య నమస్కారాలు చేస్తుంటారు. అయితే, కేవలం సూర్య నమస్కారాలు చేసినా కూడా మనం ఊహించలేనన్ని లాభాలున్నాయంటున్నారు యోగా నిపుణులు. అవేంటో చూద్దాం. సూర్య నమస్కారాలు చేయటం వల్ల చర్మ సౌందర్యం పెరుగుతుంది. ముఖంలో వర్ఛసు కలుగుతుంది. ఎందుకంటే, సూర్య నమస్కారాలు చేస్తున్నప్పుడు ఒంటికి బాగా చెమటపడుతుంది. దీని వల్ల శరీరంలోని మలినాలు, విషతుల్యమైన పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. కాబట్టి చర్మం, ముఖం కాంతివంతంగా తయారవుతాయి.

benefits-of-suryanamskaras
benefits-of-suryanamskaras

ఇక సూర్య నమస్కారాల్లో మీరు నమ్మలేని మరో లాభం కూడా వుంది. వెంట్రుకలు రాలటం, తెల్లబడటం కూడా తగ్గుతుంది. ఇలా ఎందుకుంటే, సూర్య నమస్కారాలు చేసేప్పుడు తలలోకి రక్తం ప్రవహించేలా చేసే ఆసనాలు కూడా వుంటాయి. వాటి వల్ల మెదడులోకి ఎక్కువ రక్త ప్రసరణ జరిగి కేశాలు బలంగా, ఒత్తుగా వుంటాయి. ఈ మధ్య కాలంలో చాలా మంది సతమతం అయ్యే అధిక బరువుకి కూడా సూర్య నమస్కారాలు గొప్ప పరిష్కారం. ఇవి క్రమంగా చేస్తూ వుంటే శరీరం చక్కటి ఆకృతిలోకి వస్తుంది. అందుకే, పవర్ యోగా అంటూ నేర్పించే వారు కూడా సూర్య నమస్కారాలు చేయిస్తుంటారు. వీటి వల్ల శరీరంలోని ప్రతీ అంగం, అవయవం ఒత్తిడికి లోనై, చురుగ్గా వుంటుంది. కొన్నాళ్లకి పొట్టతో సహా అన్ని చోట్లా వున్న అధిక కొవ్వు దానంతటదే కరిగిపోతుంది.

చర్మ సౌందర్యం, వెంట్రుకలు, అధిక బరువు& ఇవన్నీ సూర్య నమస్కారాలు మనకిచ్చే పైపై లాభాలు మాత్రమే. సూర్య నమస్కారాలు చేస్తే ఒంటి లోపల జరిగే అద్భుతాలు మరెన్నో. ఇవి చేయటం వల్ల కడుపులోని పేగులు సక్రమంగా పని చేయటం మొదలు పెడతాయి. జీర్ణ వ్యవస్థ బాగుపడి అజీర్తి సమస్యలు, మలబద్ధకం వంటివి వుండవు. మూత్ర పిండాలు కూడా సూర్య నమస్కారాలు చేసే వారిలో సమర్థంగా పని చేస్తాయి. రక్తం ప్రసరణ శరీరం మొత్తం క్రమంగా జరగటంతో కిడ్నీలు ఎలాంటి ఆటంకం లేకుండా పని చేయగలుగుతాయి. ఇక ఉపిరితిత్తులు కూడా సూర్యనమస్కారాలు చేసే వారిలో ఆరోగ్యంగా తయారవుతాయి. సూర్య నమస్కారాల సమయంలో ఒంట్లోని గాలి అంతా బలంగా వదలటం జరుగుతుంది. తిరిగి స్వచ్ఛమైన గాలి పీలుస్తాం. దీని వల్ల ఉపిరితిత్తులు శుద్ధి అవుతాయి. మెదడుకు కూడా ఎక్కువ ప్రాణ వాయువు లభించి మనలో నూతన ఉత్సాహం తాండవిస్తుంది. ఉల్లాసంగా అనిపిస్తుంది.

చివరగా, సూర్య నమస్కారాలు రోజూ చేసే వారికి వివిధ హార్మోన్ల సమతుల్యత ఏర్పడుతుంది. థైరాయిడ్, సమస్యల్లాంటివి కంట్రోల్ అవుతాయి. నరాలు, కండరాలు కూడా ఆరోగ్యంగా , బలంగా మారతాయి. మొత్తంగా మన శరీరం మనకే ఒక భారంగా కాక బలమైన ఆయుధంలా ఉపయోగపడుతుంది. అందుకే, రోజూ సూర్య నమస్కారాలు చేయండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి సుఖవంతమైన జీవనాన్ని గడపండి.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news