చొట్టనిక్కర దేవాలయం చుట్టొద్దాం

-

కేరళలోని ఎర్నాకులం జిల్లాలోని కొచ్చిలో ఉన్న చొట్టనిక్కర పట్టణం అందమైనది. లక్షాలాది మంద్రి యాత్రికులు ఇక్కడికి వస్తారు. అందమైన ఈ ప్రదేశం యాత్రికులు అమితంగా ఇష్టపడతారు. చొట్టనిక్కర దేవాలయం లేదా చొట్టనిక్కర భగవతి దేవాలయం అనికూడా అంటారు. ఈ ఆలయం శతాబ్దాల కింద నిర్మించినది. ఈ దేవాలయ శిల్పశైలి అద్భుతం. విశ్వకర్మ స్తపతి నమూనలో ఉంటుంది. ఇక్కడ జరిగే ఉత్సవాల్లో తోజాల్‌ వేడుక ప్రసిద్ధి చెందింది.

 

ఇక్కడ త్రిరూనితుర హిల్‌ మ్యూజియం మరో ప్రత్యేకత ఉంది. రాజ్యానికి సంబంధించిన వస్తులను ప్రదర్శనలో పెడతారు. కాడు తురుతి, శివదేశాలయం, పూర్ణత్రయేశ దేవాలయాలు రెండూ పర్యాటకులు తప్పక చూడాల్సిన ప్రదేశాలు. శివదేశాలయానికి సమీపంలో ఎంబాంక్‌ సరస్సు సమీపంలో ఉంటుంది.

ఓనం పండుగ

ఇక ఓనం పండుగ సీజన్‌లో నిర్వహించే తిరుఓనం, నవరాత్రి ఉత్సవాలు చొట్టనిక్కర దేవాలయం ఖ్యాతి పొందింది. ప్రతి ఏడు జరిగే ఈ ఉత్సవాలకు ఏడు పెద్ద ఏనుగులను ఉపయోగిస్తారు. చక్కని ప్రదేశం ఏడాదంతా ఉష్ణమండల వాతావరనం కలిగి ఉంటుంది. ఈ దేవాలయాలను సందర్శించాలంటే ఆగస్టు నుంచి మార్చి వరకు ఉత్తమం. కొచ్చికి అతి దగ్గరగా ఉండటంతో ప్రయాణం కూడా సులభం.

ఎలా వెళ్లాలి?

దీనికి సమీపంలోనే రైలు లేదా విమాన సదుపాయాలు ఉన్నాయి. బస్సులు కూడా అధికంగానే ఉన్నాయి. రొడ్డు ప్రయాణం చేసేవారు పచ్చటి పొలాలను చూస్తూ ఆహ్లాదం పొందవచ్చు. రోడ్ల పక్కనే పొడవాటి అందమైన కొబ్బరి చెట్ల చల్లని గాలులు చాలా బాగుంటుంది. ఈ గ్రామంలో నిత్యం భజనలు, ప్రార్ధనలతో నిండి ఉంటుంది. ఈ ఆలయాలను 12 రోజులు సందర్శిస్తే జీవితం ధన్యమవుతుంది. తక్కువ బడ్జెట్‌తో ఎక్కువ ఆనందం పొందవచ్చు. ఇక్కడ మరిన్ని ప్రదేశాలు.. మట్టన్‌ చేరి హార్బర్, వైకం మహదేవాయం. ఇంకేంటి ఇక చొట్టనిక్కర చుట్టేద్దాం రండి.

Read more RELATED
Recommended to you

Latest news