TTD : ఈనెల 11న డిసెంబరు కోటా ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల

-

ఈనెల 11న శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. డిసెంబరు నెల రూ.300 టికెట్లను ఆన్‌లైన్‌ అందుబాటులో ఉంచుతామని వెల్లడించింది. 11వ తేదీన ఉదయం 10 గంటలకు తితిదే వెబ్‌సైట్‌లో టికెట్లను విడుదల చేయనున్నట్లు పేర్కొంది. వీఐపీ బ్రేక్‌ దర్శన వేళల్లో మార్పుల కారణంగా డిసెంబరు కోటా టికెట్ల విడుదల ఆలస్యమైందని తితిదే అధికారులు పేర్కొన్నారు.

డిసెంబర్‌ నెల మొత్తానికి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు అందుబాటులో ఉంచనున్నామని టీటీడీ అధికారులు తెలిపారు. భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో టికెట్లను బుక్‌ చేసుకోవాలని సూచించారు. కరోనా మహమ్మారి తరువాత తిరుమలలో పూర్తిగా నిబంధనలు ఎత్తివేయడంతో కొన్ని నెలలుగా భక్తులు పెద్ద ఎత్తున తిరుమలను సందర్శిస్తున్నారు. ఇక డిసెంబర్‌ నెలలో అధిక పెళ్లిళ్లు ఉన్నందను భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news